ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shilpa Layout Flyover: శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ ప్రారంభం

ABN, First Publish Date - 2022-11-25T16:49:57+05:30

శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ (Shilpa Layout Flyover)ను మంత్రి కేటీఆర్ (KTR) ప్రారంభించారు. గచ్చిబౌలి జంక్షన్లో రూ.300 కోట్ల వ్యయంతో ఫ్లై ఓవర్ నిర్మించారు. శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో.. ఓఆర్ఆర్ నుంచి సిటీలోకి ప్రవేశానికి మార్గం సుగమమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ (Shilpa Layout Flyover)ను మంత్రి కేటీఆర్ (KTR) ప్రారంభించారు. గచ్చిబౌలి జంక్షన్లో రూ.300 కోట్ల వ్యయంతో ఫ్లై ఓవర్ నిర్మించారు. శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో.. ఓఆర్ఆర్ నుంచి సిటీలోకి ప్రవేశానికి మార్గం సుగమమైంది. జూబ్లీహిల్స్, పంజాగుట్ట (Jubilee Hills Panjagutta) నుంచి గచ్చిబౌలి మీదుగా పటాన్చెరు, కోకాపేట్, నార్సింగ్తో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లేందుకు సులభతరమైంది. ఎస్ఆర్డీపీ ద్వారా 17వ ఫ్లైఓవర్ బ్రిడ్జి చేపట్టారు.

ఇవి ప్రయోజనాలు

ఈ వంతెన అందుబాటులోకి రావడం వల్ల గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యకు ఉపశమనం లభిస్తుంది.

నాలెడ్జ్ సెంటర్, పరిసర ప్రాంతాల్లో మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుంది.

హైటెక్ సిటీ, నాలెడ్జ్ సెంటర్, ఫెనాన్షియల్ డ్రిస్ట్రిక్ట్‌ల మధ్య కనెక్టివిటీ మరింత పెరుగుతుంది.

పంజాగుట్ట నుంచి గచ్చిబౌలి వరకు కారిడార్ ఇంప్రూవ్‌మెంట్‌లో కొంత మేర పూర్తవుతుంది.

పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జ్, రోడ్ నెంబర్-45 వంతెన, కేబుల్ బ్రిడ్జి, మైండ్ స్పేస్ వంతెన మీదుగా గచ్చిబౌలి సులువుగా చేరుకునే వెసులుబాటు కలుగుతుంది. ఈ మార్గం నుంచి అంతర్జాతీయ విమానాశ్రయానికి ట్రాఫిక్ చిక్కులు లేకుండా ప్రయాణించొచ్చు.

Updated Date - 2022-11-25T16:49:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising