TS News: ఫారెస్ట్ రేంజర్ హత్యకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే..సోయం బాపురావు
ABN, First Publish Date - 2022-12-11T18:13:15+05:30
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హత్యకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు (Soyam Bapu Rao) అన్నారు. ఆదివాసి సమాజాన్ని బాధ పెట్టిన కారణంగానే శ్రీనివాసరావు హత్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హత్యకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు (Soyam Bapu Rao) అన్నారు. ఆదివాసి సమాజాన్ని బాధ పెట్టిన కారణంగానే శ్రీనివాసరావు హత్య జరిగిందన్నారు. కొత్తగూడెంలో ఆయన మాట్లాడుతూ.. 3లక్షల 50వేల మంది గోత్తి కోయలు పోడు భూములకు పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారని, వాటిని పొందేందుకు గోత్తి కోయలకు అర్హత ఉందన్నారు. అటవీశాఖ అధికారులు పోడు భూములు సాగు చేసుకుంటున్న ఇతరుల జోలికి వెళ్లకుండా.. కేవలం ఆదివాసీలను మాత్రమే వేధిస్తున్నారని ఆరోపించారు. ఫారెస్ట్ రేంజర్ హత్యను సాకుగా చూపి రాష్ట్రంలో ఉన్న మొత్తం గుత్తి కోయలను రాష్ట్రం నుంచి వెళ్ళ గొట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. సీఎం కేసీఆర్ పోడు భూములకు పట్టాలు ఇస్తామని కపట నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోతే మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
Updated Date - 2022-12-11T18:13:16+05:30 IST