ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Revanth reddy: ఎన్నికల్లో కాంగ్రెస్ పరిధిని తగ్గించే ప్రయత్నం

ABN, First Publish Date - 2022-10-29T12:17:31+05:30

ఎన్నికల్లో కాంగ్రెస్ పరిధిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మునుగోడు: ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) పరిధిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నిక (Dubbaka by poll) సమయంలో రఘునందన్‌ (Raghunandan Rao)ను ప్రభుత్వం చంపేస్తోందని ప్రచారం చేసి సానుభూతి క్రియేట్ చేశారని... హుజురాబాద్‌ (Huzurabad election)లో ఈటల (Etela rajender) సానుభూతితో గెలిచారని తెలిపారు. దుబ్బాక, హుజురాబాద్‌ ఎన్నికల్లో దొరికిన డబ్బు ఏమైందని ప్రశ్నించారు. రఘునందన్‌రావుపై పెట్టిన కేసులు ఏమయ్యాయన్నారు. ఈటల ఆక్రమించుకున్న భూములు ఎక్కడ పోయాయని నిలదీశారు. ఈటలపై అక్రమాల ఆరోపణలు ఎన్నికలు పూర్తవగానే ఆగిపోయాయని గుర్తు చేశారు.

కేసీఆర్ (KCR), అమిత్‌షా (Amith shah) కలిసి కాంగ్రెస్‌ను బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. బీజేపీ (BJP), టీఆర్ఎస్ (TRS) వీధి నాటకాలు వేస్తారని 8 రోజుల కిందే చెప్పానని తెలిపారు. కోట్లు దొరికాయంటున్నారు కానీ.. రికవరీ చూపడం లేదన్నారు. రాహుల్ (Rahul gandhi) పాదయాత్ర మొదలైన నాటి నుంచి టీఆర్ఎస్, బీజేపీ నాటకాలు మొదలయ్యాయని అన్నారు. కేసీఆర్, కేటీఆర్‌కు ఫామ్‌హౌస్‌లు బాగా కలిసొస్తాయని రేవంత్‌రెడ్డి (TPCC Chief) యెద్దేవా చేశారు.

Updated Date - 2022-10-29T12:19:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising