YS Sharmila: టీఆర్ఎస్ గూండాలు ఆడోళ్ళతో సమానం
ABN, First Publish Date - 2022-11-13T20:01:56+05:30
Peddapalli: వైఎస్ శర్మిల చేపట్టిన ‘‘ప్రజా ప్రస్థానం’’ (PrajaPrastanam) పాదయాత్ర పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్ర సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఆమెకు స్వాగతం పలుకుతూ పలు చోట్ల ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టారు. అయితే వాటిని కొందరు తొలగించారు.
Peddapalli: వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ‘‘ప్రజా ప్రస్థానం’’ (PrajaPrastanam) పాదయాత్ర పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్ర సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఆమెకు స్వాగతం పలుకుతూ పలు చోట్ల ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టారు. అయితే వాటిని కొందరు తొలగించారు. తొలగించిన వారు టీఆర్‌ఎస్ (TRS) కార్యకర్తలే అయి ఉంటారని షర్మిల అనుమానం వ్యక్తం చేశారు. ఈ పని చేసిన వాళ్లను గుండాలతో పోలుస్తూ..వాళ్లు ఆడోళ్లతో సమానమని పేర్కొన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eswar) దత్తత గ్రామంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా...? వరదలు వస్తే ప్రజలను ఆదుకున్నారా? దళిత మంత్రి అయి ఉండి ఆయన ఎంత మంది దళితులకు దళిత బంధు పథకాన్ని మంజూరు చేయించారు? డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చారా? కనీసం రోడ్లయినా వేశారా..? అని ప్రశ్నించారు. ఒక మహిళ పాదయాత్ర చేస్తుంటే దాడులకు తెగబడడం, కార్యకర్తలపై దాడులకు దిగడం, కోడిగుడ్లు విసరడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2022-11-13T20:04:12+05:30 IST