Kishan Reddy: టీఆర్ఎస్ ప్రభుత్వం చేతకాని తనం వల్లే..
ABN, First Publish Date - 2022-11-11T20:07:08+05:30
TS News: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కేసీఆర్ సర్కారు (CM KCR)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని (PM Modi) పర్యటనపై కేసీఆర్ తీరు విచారకరమన్నారు. ప్రధాని పర్యటనలో పాల్గొనాలని సీఎం కేసీఆర్కు స్వయంగా పెట్రోలియం శాఖామంత్రి లేఖ రాశారని తెలిపారు.
TS News: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కేసీఆర్ సర్కారు (CM KCR)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని (PM Modi) పర్యటనపై కేసీఆర్ తీరు విచారకరమన్నారు. ప్రధాని పర్యటనలో పాల్గొనాలని సీఎం కేసీఆర్కు స్వయంగా పెట్రోలియం శాఖామంత్రి లేఖ రాశారని తెలిపారు. మహిళా గవర్నర్ను టీఆర్ఎస్ సర్కార్ పదే పదే అవమానించటాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రధానికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం విచారకరమన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసేవరకూ కేసీఆర్ను వదలమన్నారు. ఈడీ, సీబీఐ దాడులతో కేంద్రానికి ఏ సంబంధం లేదన్నారు.‘‘కేంద్రం నిధులు ఇవ్వకుంటే.. తెలంగాణ సర్కార్ కాళేశ్వరం కట్టేదా?భయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని ఎందుకు తెరవలేదో తండ్రీకొడుకులు చెప్పాలి? ఫాంహౌస్ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం చేతకాని తనం వల్లే..కేంద్ర ప్రాజెక్టులను రాష్ట్రం కోల్పోతోంది’’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2022-11-11T20:07:10+05:30 IST