ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayashanti: రైతుల ప్రాణాలు తీసే రాక్షస ప్రభుత్వం టీఆర్ఎస్

ABN, First Publish Date - 2022-12-05T22:02:03+05:30

Hyderabad: చెరువు నీరు తన పొలంలోకి వచ్చి చేరుతుండడంతో పంట నష్టపోతున్నానని.. తనకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలంటూ పుట్ట అంజయ్య(28) అనే రైతు సెల్‌ టవర్‌ ఎక్కి రుమాలుతో ఉరేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మెంగారం గ్రామంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: చెరువు నీరు తన పొలంలోకి వచ్చి చేరుతుండడంతో పంట నష్టపోతున్నానని.. తనకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలంటూ పుట్ట అంజయ్య(28) అనే రైతు సెల్‌ టవర్‌ ఎక్కి రుమాలుతో ఉరేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మెంగారం గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై బీజేపీ నాయకురాలు విజయశాంతి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తీవ్రంగా కలచివేసిన ఈ ఘటనతో కేసీఆర్ పాలన తీరును ఆమె సోషల్ మీడియా తూర్పారబట్టారు.

విజయశాంతి పోస్టు యథాతథంగా..

‘‘కేసీఆర్ సర్కారంటే రైతుల ప్రాణాలు తీసే రాక్షస ప్రభుత్వం అని మరోసారి రుజువైంది. ప్రభుత్వ యంత్రాంగం దారుణ నిర్లక్ష్యం వల్ల కామారెడ్డి జిల్లా మెంగారం గ్రామానికి చెందిన రైతు ఆంజనేయులు తన పిల్లలు చూస్తుండగానే ఆత్మహత్య చేసుకున్నడు. ఈ గ్రామంలో చెరువు కింది భాగంలో ఉన్న ఆంజనేయులు పొలం మీదుగా నిత్యం నీరు ప్రవహిస్తుండటంతో తనకు న్యాయం చెయ్యాలని, పరిహారం ఇప్పించాలని ఏళ్లకేళ్లు అధికారులను వేడుకుంటూనే ఉన్నడు. ఆంజనేయులు మొరను అధికారులు పట్టించుకోకపోవడంతో సెల్ టవర్ ఎక్కి తన పిల్లలు చూస్తుండగానే ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఇదీ తెలంగాణ రైతుకు పట్టిన గతి. ఒక అన్నదాత బలవన్మరణం పాలయ్యేలా చేసి అతని పిల్లల్ని అనాథల్ని చేసిన ఈ కేసీఆర్ సర్కార్ పాపం పండింది. ఈ ప్రభుత్వం పతనమయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. కేసీఆర్ గారి సర్కారు తప్పులు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రజా తీర్పు ఎన్నడైనా తప్పని పరిణామమే ఎంతటి నియంతకైనా...’’ అని విజయశాంతి పేర్కొన్నారు.

Updated Date - 2022-12-05T22:02:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising