TRS : టీఆర్‌ఎస్ విజయం బీజేపీకి చెంపపెట్టు
ABN, First Publish Date - 2022-11-08T06:18:51+05:30
మునుగోడులో టీఆర్‌ఎస్ విజయం బీజేపీకి చెంపపెట్టు అని పలువురు టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. బీజేపీ ఎత్తుగడలను మునుగోడు ప్రజలు చిత్తు చేశారని ..
చిన్న పిల్లోడిలా బండి సంజయ్ వ్యాఖ్యలు: టీఆర్‌ఎస్
హైదరాబాద్/న్యూఢిల్లీ, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): మునుగోడులో టీఆర్‌ఎస్ విజయం బీజేపీకి చెంపపెట్టు అని పలువురు టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. బీజేపీ ఎత్తుగడలను మునుగోడు ప్రజలు చిత్తు చేశారని కొనియాడారు. టీఆర్‌ఎ్‌సఎల్పీ కార్యాలయంలో సోమవారం ఎంపీలు వెంకటేష్ నేత, మాలోతు కవిత, మన్నె శ్రీనివా్‌సరెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్, ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ విలేకరులతో మాట్లాడారు. మునుగోడు ఫలితం తర్వాత బీజేపీ నాయకులు సోయి తప్పి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. డబ్బులు పంచి టీఆర్‌ఎస్ గెలిచిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. చిన్నపిల్లోడిలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఈసీని అడ్డుపెట్టుకొని టీఆర్‌ఎ్‌సను ఓడించాలని చూసింది.. బీజేపీనేనని ఆరోపించారు. కారును పోలిన గుర్తుల వల్ల 7వేల ఓట్లు కోల్పోయామని, లేదంటే 17వేల మెజారిటీ వచ్చి ఉండేదని అన్నారు. వామపక్షాలతో బహిరంగంగానే పొత్తు పెట్టుకున్నామని, బీజేపీలాగా లాలూచీ రాజకీయాలు చేయలేదన్నారు. టీఆర్‌ఎస్ గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రగల్భాలు పలికిన రాజగోపాల్‌రెడ్డి.. ఆ మాట మీద నిలబడాలని సవాల్ చేశారు. కేటీఆర్‌పై మాట్లాడే స్థాయి వివేక్‌కు లేదని అన్నారు. బూర నర్సయ్యగౌడ్‌కు గ్రహచారం బాగా లేదని, టీఆర్‌ఎ్‌సలో ఉంటే మరో ఏడాదిలో ఎంపీ అయ్యేవారని పేర్కొన్నారు. హుజురాబాద్ హత్యా రాజకీయాలను మునుగోడుకు తేవాలని ఈటల రాజేందర్ ప్రయత్నించారని, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని చంపాలని కుట్ర పన్నారని ఆరోపించారు. ఆయన పీఏ దగ్గర దొరికిన డబ్బు గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించి, అడ్డంగా దొరికిపోయిన బీజేపీకి తెలంగాణలో స్థానం లేదన్నారు.
Updated Date - 2022-11-08T06:18:52+05:30 IST