ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tummala Comments: ఏ క్షణమైనా పిడుగు పడొచ్చు.. తుమ్మల కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-08-03T23:39:40+05:30

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ క్షణమైనా పిడుగు పడొచ్చని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ క్షణమైనా పిడుగు పడొచ్చని, కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. బుధవారం ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయెద్దని కార్యకర్తలకు సూచించారు. మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధిపైనే దృష్టి పెట్టానని గుర్తుచేశారు. కార్యకర్తలను పూర్తిస్థాయిలో కలవలేకపోయానని తెలిపారు. గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తిరిగానని, ఇప్పుడు మాత్రం పాలేరుపైనే దృష్టిపెట్టానని చెప్పారు. కార్యకర్తలు ఆశీర్వదిస్తే మిగిలిన పనులను పూర్తి చేస్తానని తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.


‘‘ఏ క్షణమైనా పిడుగు పడొచ్చు’’ అని తుమ్మల చేసిన వ్యాఖ్యలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా తుమ్మల బీజేపీ (BJP)లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఇలాంటి కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది. రేపోమాపో బీజేపీలో చేరేందుకు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy), టీఆర్‌ఎస్ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు సిద్ధంగా ఉన్నారని సమాచారం. వీరితో పాటు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లోని కీలక నేతలు కమలం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు చాలా హీట్ మీద ఉన్నాయి. ఇలాంటి తరుణంలో తుమ్మల కామెంట్స్‌పై పెద్ద చర్చ నడుస్తోంది. మరోవైపు తెలంగాణలో కేసీఆర్ (KCR) ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ఓ చర్చ నడుస్తోంది. ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, కార్యకర్తలను సన్నద్ధం చేయడానికే ఆ వ్యాఖ్యలు చేశారని పరిశీలకులు అంటున్నారు. గత ఎన్నికల్లో తుమ్మల ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఏలాగైనా గెలవాలనే ఉద్దేశంతో కార్యకర్తలను సిద్ధం చేసేందుకు కీలక వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు.



Updated Date - 2022-08-03T23:39:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising