ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayashanthi: శ్రీనివాసరావు హత్యకు గురికావడం ఎంతో బాధాకరం

ABN, First Publish Date - 2022-11-23T21:14:52+05:30

ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి చలమల శ్రీనివాసరావును గొత్తికోయలు దారుణంగా హత్య చేశారు. శ్రీనివాసరావు మృతిపై బీజేపీ నేత విజయశాంతి (Vijayashanthi) ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఖమ్మం జిల్లా చంద్రుగొండ ఫారెస్ట్‌ రేంజ్ అధికారి శ్రీనివాసరావు (Srinivasa Rao) హత్యకు గురికావడం ఎంతో బాధాకరం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి చలమల శ్రీనివాసరావును గొత్తికోయలు దారుణంగా హత్య చేశారు. శ్రీనివాసరావు మృతిపై బీజేపీ నేత విజయశాంతి (Vijayashanthi) ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఖమ్మం జిల్లా చంద్రుగొండ ఫారెస్ట్‌ రేంజ్ అధికారి శ్రీనివాసరావు (Srinivasa Rao) హత్యకు గురికావడం ఎంతో బాధాకరం. పోడు భూముల వ్యవహారంతో ముడిపడిన ఈ దురదృష్టకర సంఘటన అనంతరం శ్రీనివాసరావు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించడం గురించి అలా ఉంచితే.... అసలు కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యం, తాత్సార ధోరణి వల్లే పరిస్థితులు ఇంతవరకూ వచ్చాయి. పోడు భూముల సమస్య ఏళ్ళ తరబడి రగులుతూనే ఉన్నా తెలంగాణ సర్కారు మాత్రం హామీలతో కాలం గడిపేస్తూ వచ్చింది. మరోవైపు ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకున్న పోడు భూములు, అడవుల రక్షణ విధులు నిర్వర్తించే ఫారెస్ట్ అధికారులపై దాడులు జరుగుతుంటే పాలకుల నుంచి దిద్దుబాటు చర్యలేమీ లేవు. పోడు భూముల్లో హరితహారం సహా ఈ విషయంలో ప్రభుత్వం నుంచి విధానపరమైన నిర్ణయాలు లేకపోవడం అటు పోడు భూముల సాగుదారులకు, ఇటు అటవీ అధికారులకు సమస్యగా మారింది. పరిస్థితులు మరింతగా విషమించక ముందే తెలంగాణ సర్కారు మేలుకుంటే రాష్ట్రానికి మంచిది’’ అని విజయశాంతి హితవుపలికారు.

Updated Date - 2022-11-23T21:14:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising