ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

ABN, First Publish Date - 2022-11-05T00:30:53+05:30

లింగాలఘణపురం నవంబరు 4: మండలంలోని కళ్లెం గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి చోరీకి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కళ్లెం గ్రామానికి చెందిన దమ్ము నర్సిరెడ్డి- వెంక టలక్ష్మి దంపతులు గతనెల 29న ఇంటికి తాళం వేసి నర్మెట మండల కేంద్రంలోని కూతురు ఇంటికి వెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

5 తులాల బంగారం.. 10 తులాల వెండి అపహరణ

కళ్లెంలో ఘటన

లింగాలఘణపురం నవంబరు 4: మండలంలోని కళ్లెం గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి చోరీకి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కళ్లెం గ్రామానికి చెందిన దమ్ము నర్సిరెడ్డి- వెంక టలక్ష్మి దంపతులు గతనెల 29న ఇంటికి తాళం వేసి నర్మెట మండల కేంద్రంలోని కూతురు ఇంటికి వెళ్లారు. కాగా ఇదే అదనుగా భావించిన గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొటి ఇంట్లోకి చొరబడి బీరువాలో భద్రపరిచిన 5 తులాల బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి ఆభరణాలను చోరీ చేశారు. అయితే నర్సిరెడ్డి ఈనెల 1న పింఛన్‌ డబ్బుల కోసం నర్మెట నుంచి కళ్లెం గ్రామానికి వచ్చి తన వద్ద ఉన్న తాళంచెవితో తాళం తీస్తుండగానే అప్రయత్నంగా తాళం వచ్చి ంది. ఈ విషయాన్ని గమనించకలేకపోయిన నర్సిరెడ్డి మళ్లీ ఇంటికి తాళం వేసి వెళ్లేందుకు సిద్ధం కాగా తాళం సరిగా పట్టక పోవడంతో పక్కింటి వాళ్ల తాళం అడిగి వేశాడు. ఆ తర్వాత ఈ నెల 4న భార్య వెంకటలక్ష్మితో కలిసి ఇంటికి చేరుకున్న నర్సిరెడ్డి ఇంట్లోకి వెళ్లి బీరువా చూసే సరికి అందులోని బంగారు నగలు, వెండి నగలు మాయ మయ్యాయి. ఈ విషయమై స్థానిక ఎస్సై ప్రవీణ్‌ను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.

Updated Date - 2022-11-05T00:30:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising