విద్య, వైద్య రంగాల అభివృద్ధికి కృషి
ABN, First Publish Date - 2022-11-15T00:29:34+05:30
నెక్కొండ, నవంబరు 14 : ప్రజలకు ఎంతో ముఖ్యమైన విద్య, వైద్య రంగాలు అభివృద్ధి చేసి, మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ బొయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. మండలంలోని రెడ్లవాడ ప్రాథమిక సొసైటీ పరిధిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.
నెక్కొండ, నవంబరు 14 : ప్రజలకు ఎంతో ముఖ్యమైన విద్య, వైద్య రంగాలు అభివృద్ధి చేసి, మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ బొయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. మండలంలోని రెడ్లవాడ ప్రాథమిక సొసైటీ పరిధిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ ప్రజలకు విద్యుత్, సాగు, తాగు నీరులో ఎలాంటి కొరత లేకుండా ఉచితంగా ఎలా అందిస్తుందో, ఆదేస్థాయిలో విద్య, వైద్యసేవలను అందించుటకు రంగం సిద్ధంచేస్తోందన్నారు. రైతుల ఆదాయం డబ్బుల్ చేస్తామంటూ ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన హామీని నెరవేర్చితే వరి క్వింటా రూ.3200 ధర లభించేదన్నారు. కాని కేంద్రం వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేసేందుకు, వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కుట్ర చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం కుట్రలను అడ్డుకుంటున్నారని చెప్పారు. ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం 12 వందల కోట్ల రూపాయల నష్టాలను భరిస్తూ, రైతుల పంటలకు మద్దతు ధర కల్పిస్తోందన్నారు. గ్రామాల్లో రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయిస్తామన్నారు. సమావేశంలో ఎంపీపీ రమేశ్, జడ్పీటీసీ సరోజహరికిషన్, నెక్కొండ, రెడ్లవాడ సొసైటీల చైర్మన్‌లు జలగం సంపత్‌రావు, మారం రాము, వైస్ చైర్మన్ సంపత్, రెడ్లవాడ సర్పంచ్ రావుల శ్రీలత, టీఆర్‌ఎస్ పార్టీ మండల,పట్టణ అధ్యక్షుడు సంగని సూరయ్య, కె.భిక్షపతి, నాయకులు ఆవుల చంద్రయ్య, రవీందర్‌రెడ్డి, మాదాసు రవి, గాంధీ, సంతోష్, కిషన్, కుమార్, ఫకిర్ పాల్గొన్నారు.
సోలార్ దీపాలను పంపిణీ..
క్రమశిక్షణతో విద్యలో రాణించిన విద్యార్ధుల భవిష్య త్తు బంగారు భవిషత్తు అవుతుందని రాష్ట్ర ప్రణాళిక మండలి చైర్మన్ బోయినపెల్లి వినోద్‌కుమార్, నర్సంపే ట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం రెడ్లవాడలో విద్యార్థులకు ఉచితంగా సోలార్‌దీపాలను పంపిణీ చేశారు. డివిజన్‌లో ఆరు నుంచి 10వ తరగతి విద్యార్థులు 6450మందికి ఎమ్మె ల్యే పెద్ది సౌజన్యంతో సోలార్‌దీపాలను అందించడం అభినందనీయమని వినోద్‌కుమార్ అన్నారు.
Updated Date - 2022-11-15T00:29:36+05:30 IST