ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వినూత్న ఆవిష్కరణలు చేయాలి

ABN, First Publish Date - 2022-12-06T00:20:49+05:30

విద్యతోపాటు ప్రతీ వి ద్యార్థి వినూత్న ఆవిష్కరణకు పాటుపడాలని పంచా యతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూ చించారు. సోమవారం వర్ధన్నపేటలోని ఆల్ఫోర్స్‌ హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన జిల్లా ఇన్‌స్పైర్‌, విద్యా, వైజ్ఞానిక ముగింపు సమావేశంలో పాల్గొన్నారు. విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్లను పరిశీలించి, వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మం త్రి మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి ఏదో ఒక రంగంలో ని ష్టాతులుగా ఉండాలని, సైన్స్‌ఫెయిర్‌ విద్యార్థుల నాలెడ్జ్‌ను పెంచుతుందన్నారు. తోటి విద్యార్థులను చూసి, మనకు ఒక ఆలోచన వచ్చేలా చేయడానికి వైజ్ఞానిక ప్రదర్శన ఎంతో దోహదపడుతుందన్నారు. పట్టుదలతో ప్రతీ సాధ్యమేనన్నారు. చిన్న వయసులోనే ఇంతలా ఆలోచింపచేసే ఎగ్జిబిట్లు తయారు చేసి, అందరినీ ఆకర్షించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు విద్య ను అలవర్చుకుంటూనే, టెక్నాలజీ పరంగా తమ మేధస్సుతో రాణించడం జిల్లాకు గర్వకారణమన్నారు. ప్రభు త్వ బడుల్లో చదివే విద్యార్థులు ఎగ్జిబిట్లు తయారు చే సి తీసుకురావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. వినూ త్న ఆలోచనలతోనే ఇతర దేశాలతో పోటీ పడగలమని మంత్ర పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ వచ్చిన తర్వాత ప్రభుత్వ బడులు, గురుకులాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి చదివిస్తున్నారన్నారు.

వర్ధన్నపేటలో మాట్లాడుతున్న మంత్రి దయాకర్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అప్పుడే ఇతర దేశాలతో పోటీ పడగలం

ఎగ్జిబిట్లు ఆలోచించే విధంగా ఉన్నాయి...

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

వర్ధన్నపేటలో ముగిసిన జిల్లాస్థాయి ఇన్‌స్పైర్‌

వర్ధన్నపేట, డిసెంబరు 5: విద్యతోపాటు ప్రతీ వి ద్యార్థి వినూత్న ఆవిష్కరణకు పాటుపడాలని పంచా యతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూ చించారు. సోమవారం వర్ధన్నపేటలోని ఆల్ఫోర్స్‌ హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన జిల్లా ఇన్‌స్పైర్‌, విద్యా, వైజ్ఞానిక ముగింపు సమావేశంలో పాల్గొన్నారు. విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్లను పరిశీలించి, వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మం త్రి మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి ఏదో ఒక రంగంలో ని ష్టాతులుగా ఉండాలని, సైన్స్‌ఫెయిర్‌ విద్యార్థుల నాలెడ్జ్‌ను పెంచుతుందన్నారు. తోటి విద్యార్థులను చూసి, మనకు ఒక ఆలోచన వచ్చేలా చేయడానికి వైజ్ఞానిక ప్రదర్శన ఎంతో దోహదపడుతుందన్నారు. పట్టుదలతో ప్రతీ సాధ్యమేనన్నారు. చిన్న వయసులోనే ఇంతలా ఆలోచింపచేసే ఎగ్జిబిట్లు తయారు చేసి, అందరినీ ఆకర్షించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు విద్య ను అలవర్చుకుంటూనే, టెక్నాలజీ పరంగా తమ మేధస్సుతో రాణించడం జిల్లాకు గర్వకారణమన్నారు. ప్రభు త్వ బడుల్లో చదివే విద్యార్థులు ఎగ్జిబిట్లు తయారు చే సి తీసుకురావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. వినూ త్న ఆలోచనలతోనే ఇతర దేశాలతో పోటీ పడగలమని మంత్ర పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ వచ్చిన తర్వాత ప్రభుత్వ బడులు, గురుకులాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి చదివిస్తున్నారన్నారు.

గత ప్రభుత్వాల హయాంలో 134 రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఉంటే, ఇప్పుడు 597 ఉన్నాయని స్పష్టం చేశారు. ఒక్కో విద్యార్థిపై లక్షలాది రూపాయలు ప్రభుత్వం ఏటా ఖర్చు చేస్తోందన్నారు. పాఠశాలలు బాగు చేసేందుకు ప్రభుత్వం రూ.5వేల కోట్లను ఖర్చు చేస్తోందన్నారు. జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించాలని, అప్పుడే మీకు చదువు చెప్పిన గురువులకు మంచి వస్తుందని తెలిపారు. సెల్‌ఫోన్‌ను కూడా విద్య, సాంకేతికత పెంచుకోవడానికి వాడాలని, సినిమాలు, జోకులు, చూసేందుకు కాదని సూచించారు. అంతకు ముందు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు అందరినీ అలరించాయి. సమావేశంలో డీఈవో వాసంతి, జిల్లా సైన్స్‌ అధికారి డాక్టర్‌ శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఆంగోతు అరుణ, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, కమీషనర్‌ గొడిశాల రవీందర్‌, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి, ఆల్ఫోర్స్‌ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ సింహాద్రి, అన్ని విభాగాల కన్వీనర్లు, కో కన్వీనర్లు, కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.

అట్టహసంగా ముగిసిన వైజ్ఞానిక ప్రదర్శనలు

జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన సోమవారం అట్టహాసంగా ముగిసింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల పా ఠశాల విద్యార్థులు ప్రదర్శనలు చూసేందుకు బారులు తీరారు. సైన్స్‌, మ్యాథ్స్‌, ఎన్వరాన్‌మెంట్‌కు సంబంధించిన ప్రదర్శనాలు ప్రయోగత్మాకంగా తయారు చేసిన విద్యార్థులు ఇక్కడకి తీసుకువచ్చారు. చివరి రోజు సందర్భంగా దాదాపు వెయ్యి మందికి పైగా ఇతర పాఠశాల విద్యార్థులో రాగా, అనంతరం నిర్వహించిన సమావేశంలో సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ప్రదర్శనలు ముగియడంతో ఎగ్జిబిట్లతో తరలివచ్చిన విద్యార్థులు తిరిగి వెనుదిరిగారు.

టీచర్స్‌ ఎగ్జిబిట్స్‌లో...

మొదటి స్థానంలో ఇన్నోవేటివ్‌లో కాస్ట్‌ నో కాస్ట్‌ బయో సైన్స్‌ టీఎల్‌ఎం, ఖిలావరంగల్‌ మండలంలోని శివనగర్‌ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు ధనలక్ష్మి నిలవగా, రెండవ స్థానంలో వర్కింగ్‌ మోడల్స్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ మ్యాస్‌ లో కాస్ట్‌ నో కాస్ట్‌కు రాయపర్తి మండలంలోని గట్టికల్లు యూపీఎస్‌ ఉపాధ్యాయురాలు జాన్‌మేరి మార్గరిటాలు నిలిచారు.

Updated Date - 2022-12-06T00:20:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising