ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాంతించిన ఆయుర్వేద వైద్య విద్యార్థులు

ABN, First Publish Date - 2022-11-03T00:31:44+05:30

వరంగల్‌లోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల విద్యార్థులు బుధవారం ఆందోళన విరమించారు.

విద్యార్థులతో చర్చిస్తున్న ఆయుష్‌ అదనపు డైరెక్టర్‌లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎట్టకేలకు ఆందోళన విరమణ

గిర్మాజిపేట, నవంబరు 2: వరంగల్‌లోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల విద్యార్థులు బుధవారం ఆందోళన విరమించారు. ఆయుర్వేద వైద్య కళాశాలలో ప్రవేశాల పునరుద్ధరణకు చర్యలు, వైద్య కళాశాల, బోధన ఆస్పత్రిలో డిప్యూటేషన్‌పై సిబ్బంది నియామకాలు, కాలేజి, హాస్టల్స్‌లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ఆయుష్‌ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. అయితే ఆయుష్‌ అధికారులతో చర్చలు ఫలించే వరకు ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి బంద్‌ రెండో రోజు కూడా కొనసాగగా రోగులు వైద్యసేవల కోసం ఇబ్బందులు పడ్డారు.

తమ డిమాండ్ల సాధన కోసం బుధవారం ఆయుర్వేద ఆస్పత్రికి వైద్య విద్యార్థులు తాళాలు వేసి యథావిధిగా ధర్నాకు కూర్చున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ఆయుష్‌ అదనపు డైరెక్టర్లు డాక్టర్‌ పరమేశ్వర్‌ నాయక్‌(ఆయుర్వేద), డాక్టర్‌ లింగరాజు(యునాని) వరంగల్‌లోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. ప్రవేశాల పునరుద్ధరణకు చర్యలు కొనసాగుతున్నాయని, సమస్యలను పరిష్కరిస్తామని వెంటనే ఆందోళన విరమించాలని కోరారు.

ఈ సందర్భంగా విద్యార్థులు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. దీంతో అదనపు డైరెక్టర్లు రాష్ట్ర ఆయుష్‌ కమిషనరేట్‌ అధికారులతో ఫోన్‌లో అవసరమైన నిధుల మంజూరు గురించి మాట్లాడారు. కాలేజి, హాస్టల్స్‌లో తాగునీరు కోసం మునిసిపల్‌ కుళాయి కనెక్షన్లు, కలెక్టర్‌ సహకారంతో ఎంపీ నిధులతో బస్సు ఏర్పాటు, గ్రంథాలయంలో పుస్తకాల కోసం రూ.5 లక్షలు మంజూరు, ఎస్సీ, ఎస్టీ బుక్‌ బ్యాంక్‌ పుస్తకాలు మంజూరు, విద్యార్థినుల హాస్టల్‌కు తక్షణం అవుట్‌ సోర్సింగ్‌పై వాచ్‌మెన్‌, స్కావెంజర్‌ నియామకాలు, డిప్యూటేషన్‌పై పారామెడికల్‌ సిబ్బంది నియామకాలు తక్షణం అమలులోకి వస్తాయని అదనపు డైరెక్టర్లు పరమేశ్వర్‌ నాయక్‌, లింగరాజు చెప్పారు. దీంతో విద్యార్థులు మధ్యాహ్నం 2గంటల తరువాత ఆందోళన విరమించి తాళాలు తీశారు. అప్పటి వరకు బయట ఉన్న రోగులు, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది లోపలికి వెళ్లారు.

కాలేజి హౌజ్‌ కీపర్‌ సరెండర్‌

వరంగల్‌ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల హౌజ్‌ కీసర్‌ సారంగపాణి తమ నుంచి డబ్బులు వసూలు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడంటూ వైద్య విద్యార్థులు ఆయుష్‌ అదనపు డైరెక్టర్‌ డాక్టర్‌ లింగరాజుకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిని వెంటనే కమిషనరేట్‌కు సరెండర్‌ చేయాలని ఆయుష్‌ ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ రవినాయక్‌ను ఆదేశించారు. అలాగే ఆస్పత్రి కార్యాలయ సూపరింటెండెంట్‌ బి.కుమారస్వామి తమ స్టయిఫండ్‌, అటెండెన్స్‌ విషయంలో డబ్బులు తీసుకుంటున్నాడని హౌజ్‌ సర్జన్‌లు ఫిర్యాదు చేయడంతో అతడిపై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.

Updated Date - 2022-11-03T00:31:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising