దేశానికి దిక్సూచి అంబేద్కర్
ABN, First Publish Date - 2022-12-06T23:53:36+05:30
ప్రపంచ మేధావి బీఆర్ అంబేద్కర్ దేశానికి నిజమైన మార్గదర్శకుడు, దిక్సూచి, గొప్ప దార్శనికుడు అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కొనియాడారు. అంబేద్కర్ 66వ వర్ధంతిని పురస్కరించుకొని హనుమకొండ అంబేద్కర్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి ఆయనతోపాటు ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, మేయర్ గుండు సుధారాణి, ‘కుడా’ చైర్మన్ సుందర్‌రాజ్ యాదవ్, జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, వరంగల్ కలెక్టర్ బి.గోపి, మునిసిపల్ కమిషనర్ ప్రావీణ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, వన్నాల శ్రీరాములు తదితరులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
మంత్రి ఎర్ర బెల్లి దయాకర్‌రావు
వడ్డెపల్లి, డిసెంబరు 6: ప్రపంచ మేధావి బీఆర్ అంబేద్కర్ దేశానికి నిజమైన మార్గదర్శకుడు, దిక్సూచి, గొప్ప దార్శనికుడు అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కొనియాడారు. అంబేద్కర్ 66వ వర్ధంతిని పురస్కరించుకొని హనుమకొండ అంబేద్కర్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి ఆయనతోపాటు ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, మేయర్ గుండు సుధారాణి, ‘కుడా’ చైర్మన్ సుందర్‌రాజ్ యాదవ్, జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, వరంగల్ కలెక్టర్ బి.గోపి, మునిసిపల్ కమిషనర్ ప్రావీణ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, వన్నాల శ్రీరాములు తదితరులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం అంబేద్కర్ కూడలిలో అంబేద్కర్ యువజన సంఘం, భారతీయ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్ధంతి మహాసభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలు సైతం అంబేద్కర్ జయంతి, వర్ధంతిలను నిర్వహిస్తూ ఆయన ఖ్యాతిని కీర్తిస్తున్నాయని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తన పాలనను కొనసాగిస్తున్నారని అన్నారు. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అంబేద్కర్ మార్గమే యావత్ భారతదేశానికి అనుసరణీయమని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతోందని విమర్శించారు. రాజ్యాంగ వ్యతిరేకి అయిన బీజేపీపై ఉద్యమించాలని పిలుపు నిచ్చారు.
ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సీ ఎం కేసీఆర్ అమలుచేస్తున్నారని అన్నారు. అంబేద్కర్ ఒక దళిత వర్గానికే కాకుండా సమాజంలోని అ న్ని వర్గాలకు చెందిన ఆదర్శమూర్తి అని కొనియాడా రు. అంబేద్కర్ స్ఫూర్తితోనే పేద ప్రజలకుకేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి మంద కుమార్ మాదిగ, డీబీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రౌతు రమే్‌షకుమార్, బీఎ్‌సఐ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బొమ్మల్ల అంబేద్కర్, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తరాల సందీప్, కార్యదర్శి సింగారపు రవిప్రసాద్, జిల్లా కార్యదర్శి యాడాల రవీందర్, ప్రజాసంఘాల నాయకులు సాయిని నరేందర్, డీఎస్ ప్రభాకర్, తేళ్ల సుగుణకిశోర్, పులి రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-06T23:53:37+05:30 IST