ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Poster War: కాంగ్రెస్-బీఆర్ఎస్‌ మధ్య పోస్టర్ వార్.. పీఎస్‌లో ఫిర్యాదు

ABN, First Publish Date - 2022-12-24T12:38:37+05:30

హన్మకొండ నగరంలో పోస్టర్లు(Posters) కలకలం రేపాయి. డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి(DCC President Rajender Reddy)కి వ్యతిరేకంగా పోస్టర్లు దర్శనమిచ్చాయి. రాజేందర్‌రెడ్డి

పోస్టర్ వార్.. పీఎస్‌లో ఫిర్యాదు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: హన్మకొండ నగరంలో పోస్టర్లు(Posters) కలకలం రేపాయి. డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి(DCC President Rajender Reddy)కి వ్యతిరేకంగా పోస్టర్లు దర్శనమిచ్చాయి. రాజేందర్‌రెడ్డి కబ్జాలు, అక్రమాలకు పాల్పడ్డారని పోస్టర్లలో ఆరోపించారు. ఈ పోస్టర్లపై డీసీసీ అధ్యక్షుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోవర్టులు, ఎమ్మెల్యే అనుచరులే పోస్టర్లు వేశారని రాజేందర్‌రెడ్డి ఆరోపించారు. ‘బ్రోకర్ బ్రతుకులు మార్చుకోండి.. దమ్ముంటే మీ పేరుతో పోస్టర్లు వేయాలి’ అని ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌(MLA Dasyam Vinayabhaskar)కు రాజేందర్‌రెడ్డి సూచించారు. పోస్టర్లపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దాస్యం వినయ్‌భాస్కర్..

రాజేందర్‌రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ స్పందించారు. కోవర్టులను పెట్టుకోవల్సిన అవసరం తమ పార్టీకి లేదని తెలిపారు. కాంగ్రెస్ నేతల(Congress leaders)పై పోస్టర్లు వేసి చిల్లర రాజకీయాలు చేయబోమని చెప్పారు. ధర్మబద్ధంగానే కొట్లాడతామన్నారు. కాంగ్రెస్ నేతలు దిగజారుడు ఆరోపణలు మానుకోవాలని సూచించారు. విభజన బిల్లులో పొందిపరిచిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకపోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై భద్రకాళి గుడిలో చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.

Updated Date - 2022-12-24T12:38:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising