Vinod Kumar: షర్మిలపై తీవ్ర ఆగ్రహం.. వెళ్లి ఏపీలో చేసుకో..!
ABN, First Publish Date - 2022-12-01T14:11:45+05:30
వైఎస్.రాజశేఖర్రెడ్డి(YS. Rajasekhar Reddy) తెలంగాణకు పచ్చి వ్యతిరేకి అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్(Vinod Kumar) తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు
వరంగల్: వైఎస్.రాజశేఖర్రెడ్డి(YS. Rajasekhar Reddy) తెలంగాణకు పచ్చి వ్యతిరేకి అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్(Vinod Kumar) తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల(YS.Sharmila)పై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ‘‘షర్మిల వెనుక బీజేపీ ఉంది. బీజేపీ వదిలిన కార్యకర్త షర్మిల. అమిత్ షాతో మాట్లాడిన తర్వాత పాదయాత్ర చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడానికే షర్మిల పాదయాత్ర. తెలంగాణ ప్రజల సమస్యలపై ఒక్కరోజైనా మాట్లాడావా? తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అడ్డుపడి నిధులు విడుదల చేయకపోతే ఒక్కరోజైనా అడిగావా? దళితుల హక్కులపై కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడైనా ప్రశ్నించావా? తెలంగాణలో ఒక్క క్షణమైనా కరెంట్ పోయిందా..? అదే మీ అన్న పాలనలో కరెంట్ పరిస్థితి ఏంటి? నీ పాదయాత్రలో తెలంగాణ పచ్చదనం కనపడలేదా? ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడడం సబబేనా? తెలంగాణలో ఎన్ని రోజులు తిరిగినా మా బిడ్డ అనుకోరు. రాజకీయం కోసం సరైన ప్రజా క్షేత్రం ఎంచుకో. ఏపీకి వెళ్లి పాదయాత్ర చేసుకోండి. జగన్, షర్మిల ఒక్కటా?.. లేదంటే వేరా? అర్థంకాని పరిస్థితి’’ అని వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు.
Updated Date - 2022-12-01T14:11:46+05:30 IST