సమాజహితానికి కృషి చేయాలి
ABN, First Publish Date - 2022-11-05T23:56:04+05:30
యాదవులు జాతి అభివృద్ధితోపాటు సమాజహితానికి తోడ్పడాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. జిల్లా యాదవ సంఘం ఆధ్వర్వర్యంలో శనివారం రాత్రి జిల్లాకేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ‘ఆవుల రామన్న యాదవ్ సదర్ సమ్మేళన’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నల్లగొండ కల్చరల్, నవంబరు 5: యాదవులు జాతి అభివృద్ధితోపాటు సమాజహితానికి తోడ్పడాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. జిల్లా యాదవ సంఘం ఆధ్వర్వర్యంలో శనివారం రాత్రి జిల్లాకేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ‘ఆవుల రామన్న యాదవ్ సదర్ సమ్మేళన’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామన్న యాదవ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి మాట్లాడారు. హైదరాబాద్‌కే పరిమితమైన సదర్ సమ్మేళనాన్ని జిల్లాకు పరిచయం చేసిన రామన్న యాదవ్ ధన్యజీవి అన్నారు. అనంతరం గాంధీ నగర్‌లోని యాదవ సంఘ భవనంలో దున్నపోతులను అలంకరించి ఊరేగింపుగా తీసుకువచ్చారు. దున్నపోతుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ప్రజలు పెద్దఎత్తున హాజరై సదర్ సమ్మేళనాన్ని తిలకించారు. కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు చిన్న శ్రీశైలంయాదవ్, పంకజ్ యాదవ్, నారబోయిన భిక్షం, అల్లి వేణు, అల్లి వెంకన్న, పిల్లిరామరాజు, మేకల యాదయ్య, కన్నెబోయిన సైదులు, దూదిమెట్ల సత్తయ్య, రాము, మహేష్, వంశీ, రాము పాల్గొన్నారు.
Updated Date - 2022-11-05T23:56:06+05:30 IST