Thatikonda Rajaiah: వైఎస్ నా రాజకీయ గురువు: తాటికొండ రాజయ్య
ABN, First Publish Date - 2022-09-02T01:20:46+05:30
తనకు రాజకీయ జన్మనిచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhara Reddy)ని జీవితంలో మరువబోనని
వరంగల్: తనకు రాజకీయ జన్మనిచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhara Reddy)ని జీవితంలో మరువబోనని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Thatikonda Rajaiah) అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్ (YSR) ఆశీస్సులతో తాను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచానని, తెలంగాణ ఉద్యమ ప్రభావంతో సీఎం కేసీఆర్ (CM KCR) నేతృత్వంలో టీఆర్‌ఎస్ (TRS)లో చేరానని తెలిపారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నానని స్పష్టం చేశారు. గత 8 సంవత్సరాలుగా ప్రజా సంక్షేమ పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ కుటుంబంపై కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత పథకాలని నిలివేయాలని కేంద్రం ఒత్తిడి తెస్తోందని విమర్శించారు. ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ఎల్లవేళలా అండగా నిలవాలని తాటికొండ రాజయ్య కోరారు.
Updated Date - 2022-09-02T01:20:46+05:30 IST