వైఎస్సార్‌కి పేరు వస్తుందని అది పూర్తి చేయడం లేదు: షర్మిల
ABN, First Publish Date - 2022-09-15T01:56:53+05:30
వైఎస్సార్‌కి పేరు వస్తుందని అది పూర్తి చేయడం లేదు: షర్మిల
పాలమూరు: ఉమ్మడి పాలమూరు జిల్లా అంటే వలసల జిల్లా అని వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి కాకముందు ఇక్కడ పరిస్థితులు ఎంటో అందరికీ తెలుసన్నారు. వైఎస్సార్ సీఎం అయ్యాక పాలమూరు యూనివర్సిటీ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. పాలమూరు ప్రజలకు నెట్టెంపాడు, కోయిల్ సాగర్ రిజర్వాయర్ ద్వారా నీళ్ళు ఇచ్చారని చెప్పారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు లాంటి ప్రాజెక్ట్ లు కట్టి వైఎస్సార్ లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారని తెలిపారు. వైఎస్సార్ వెళ్ళిపోయాక ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేక పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ 90 శాతం పూర్తి చేస్తే కేసీఅర్ 10 శాతం పనులు పూర్తి చేయలేదన్నారు. వైఎస్సార్ కి పేరు వస్తుంది అని పూర్తి చేయడం లేదన్నారు. పాలమూరు జిల్లా పై కేసీఅర్ కి ప్రేమ లేదన్నారు. అసలు దక్షిణ తెలంగాణ మీదనే కేసీఅర్ కి ప్రేమ లేదని పేర్కొన్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ వైఎస్సార్ కట్టాలని అనుకున్నారని చెప్పారు.
Updated Date - 2022-09-15T01:56:53+05:30 IST