బాదం బర్ఫీ
ABN, First Publish Date - 2022-01-22T19:02:10+05:30
బాదం పలుకులు - ముప్పావు కప్పు, పంచదార - ముప్పావు కప్పు, వేడినీళ్లు - ఒక కప్పు, కుంకుమ పువ్వు కలిపిన పాలు - రెండు
కావలసినవి: బాదం పలుకులు - ముప్పావు కప్పు, పంచదార - ముప్పావు కప్పు, వేడినీళ్లు - ఒక కప్పు, కుంకుమ పువ్వు కలిపిన పాలు - రెండు టేబుల్‌స్పూన్లు, యాలకుల పొడి - అర టీస్పూన్.
తయారీ విధానం: ముందుగా ఒక బౌల్‌లో వేడి నీళ్లు పోసి బాదం పలుకులను అందులో వేసి ఒకగంట పాటు నానబెట్టుకోవాలి. తరువాత వాటి పొట్టుతీసి పక్కన పెట్టుకోవాలి. బాదం పలుకులు తడి లేకుండా ఆరిన తరువాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. స్టవ్‌పై మరొక పాన్ పెట్టి పంచదార తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి పంచదార పానకం తయారుచేసుకోవాలి. పానకం చిక్కగా అయిన తరువాత అందులో రెడీ చేసి పెట్టుకున్న బాదం పలుకుల పొడి, యాలకుల పొడి, కుంకుమపువ్వు కలిపిన పాలు పోయాలి. చిన్నమంటపై కాసేపు ఉంచుకుని దింపుకోవాలి. బాదం మిశ్రమం చల్లారిన తరువాత ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.
Updated Date - 2022-01-22T19:02:10+05:30 IST