బార్లీ షర్బత్
ABN, First Publish Date - 2022-04-20T18:52:19+05:30
బార్లీ - అరకప్పు, పంచదార - రెండు టీస్పూన్‌లు, నిమ్మరసం - రెండు టీస్పూన్‌లు, నీళ్లు - తగినన్ని, తేనె - ఒకస్పూన్.
కావలసినవి: బార్లీ - అరకప్పు, పంచదార - రెండు టీస్పూన్‌లు, నిమ్మరసం - రెండు టీస్పూన్‌లు, నీళ్లు - తగినన్ని, తేనె - ఒకస్పూన్.
తయారీ ఇలా: బార్లీ గింజలను శుభ్రంగా కడిగి నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి.తరువాత ఆ నీటిని తీసేసి, బార్లీ గింజలను కుక్కర్‌లో చిన్నమంటపై అరగంట పాటు ఉడికించుకోవాలి. పూర్తిగా ఆవిరిపోయిన తరువాత పంచదార, నిమ్మరసం, తేనే వేసి బాగా కలుపుకోవాలి.ఫ్రిజ్‌లో పెట్టి చల్లచల్లని బార్లీ వాటర్‌ను సర్వ్ చేసుకోవాలి.
Updated Date - 2022-04-20T18:52:19+05:30 IST