జల్‌జీరా
ABN, First Publish Date - 2022-04-14T16:58:41+05:30
పుదీనా - ఒక కట్ట, నిమ్మరసం - కొద్దిగా, ఉప్పు - రుచికి తగినంత, నీళ్లు - రెండు గ్లాసులు, జీలకర్ర - రెండు టేబుల్ స్పూన్లు, కొత్తిమీర - ఒక కట్ట, అల్లం - కొద్దిగా, పంచదార
కావలసినవి: పుదీనా - ఒక కట్ట, నిమ్మరసం - కొద్దిగా, ఉప్పు - రుచికి తగినంత, నీళ్లు - రెండు గ్లాసులు, జీలకర్ర - రెండు టేబుల్ స్పూన్లు, కొత్తిమీర - ఒక కట్ట, అల్లం - కొద్దిగా, పంచదార - నాలుగు టేబుల్ స్పూన్లు, ఇంగువ - చిటికెడు, చింతపండు - కొద్దిగా.
తయారుచేయు విధానం: పుదీనా, కొత్తిమీర శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. జీలకర్రను వేయించుకోవాలి. మిక్సీలో పుదీనా, కొత్తిమీర, చింతపండు వేసి పట్టుకోవాలి. తరువాత వేయించిన జీలకర్ర, అల్లం ముక్క వేసి మరోసారి బ్లెండ్ చేయాలి. ఇంగువ, ఉప్పు, పంచదార, నిమ్మరసం వేసి, తగినన్ని నీళ్లు పోసి మరోసారి పట్టుకోవాలి. జాలీతో వడబోసి, ఐస్‌క్యూబ్‌లు వేసి చల్లని డ్రింక్ సర్వ్ చేసుకోవాలి.
Updated Date - 2022-04-14T16:58:41+05:30 IST