వాటర్ మెలన్ మాక్‌టైల్
ABN, First Publish Date - 2022-04-22T20:58:12+05:30
పుచ్చకాయ- ఒకటి, నిమ్మకాయలు- రెండు, చక్కెర- ఒక స్పూను, చల్లని సోడా- 500 ఎంఎల్, ఐస్ క్యూబ్స్- 15, పుదీనా ఆకులు- కొన్ని.
కావలసిన పదార్థాలు: పుచ్చకాయ- ఒకటి, నిమ్మకాయలు- రెండు, చక్కెర- ఒక స్పూను, చల్లని సోడా- 500 ఎంఎల్, ఐస్ క్యూబ్స్- 15, పుదీనా ఆకులు- కొన్ని.
తయారుచేసే విధానం: ముందుగా పుచ్చకాయ ముక్కల్ని కోసుకుని ఫ్రీజర్‌లో పెట్టాలి. నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. ఓ నిమ్మబద్దను సన్నటి వలయాల్లా కత్తిరించాలి. గంట తరవాత పుచ్చకాయ ముక్కలు, సోడా, నిమ్మరసం, చక్కెర కలిపి జ్యూసర్‌లో తిప్పాలి. ఈ జ్యూస్‌నంతా ఓ జగ్గులోకి తీసుకుని ఐస్ క్యూబ్‌లూ కలపాలి. పొడవాటి గ్లాసుల్లో వేసి నిమ్మదబ్బ, పుదీనా ఆకుల్ని పైన అలంకరిస్తే సరి.
Updated Date - 2022-04-22T20:58:12+05:30 IST