ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిలౌటి కబాబ్‌ విత్‌ ఉల్టా తవ్వా కా పరోటా

ABN, First Publish Date - 2022-02-26T16:59:23+05:30

వీకెండ్‌ వచ్చిందంటే చాలు నాన్‌వెజ్‌ వైపు మనసు లాగేస్తుంది. అయితే ఎప్పుడూ కర్రీ, వేపుడు తినడమంటే బోర్‌ కొడుతుంది. అందుకే ఈ వారం కాస్త భిన్నంగా వీటిని ట్రై చేయండి. ఈ నాన్‌వెజ్‌ స్నాక్స్‌తో వీకెండ్‌లో మీ జిహ్వచాపల్యం తీరుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కెవ్వు కబాబ్‌!

వీకెండ్‌ వచ్చిందంటే చాలు నాన్‌వెజ్‌ వైపు మనసు లాగేస్తుంది. అయితే ఎప్పుడూ కర్రీ, వేపుడు తినడమంటే బోర్‌ కొడుతుంది. అందుకే ఈ వారం కాస్త భిన్నంగా వీటిని ట్రై చేయండి. ఈ నాన్‌వెజ్‌ స్నాక్స్‌తో వీకెండ్‌లో మీ జిహ్వచాపల్యం తీరుతుంది.


కావలసినవి: బోన్‌లెస్‌ మటన్‌ - అరకేజీ, లేత మేక కొవ్వు - 200గ్రా, జీడిపప్పు - 100గ్రా, వెల్లుల్లి రెబ్బలు - 50గ్రా, నెయ్యి - 100గ్రా, ఉల్లిపాయలు - 100గ్రా, పుదీనా - 50గ్రా, దాల్చిన  చెక్క - 30గ్రా, యాలకులు - 30గ్రా, పొట్లిమసాల - 30గ్రా, లవంగాలు - 30గ్రా, గరంమసాల - 50గ్రా, ఉప్పు - తగినంత.


తయారీ విధానం: స్టవ్‌పై పాన్‌పెట్టి కొద్దిగా నెయ్యి వేసి మటన్‌, కొవ్వును వేయించి పక్కన పెట్టుకోవాలి. మిక్సీలో జీడిపప్పు, వెల్లుల్లి రెబ్బలు, దాల్చిన చెక్క, యాలకులు, పొట్లి మసాల, లవంగాలు, గరంమసాల వేసి బ్లెండ్‌ చేసుకోవాలి. తరువాత వేయించి పెట్టుకున్న మటన్‌, కొవ్వును వేసి మరోసారి బ్లెండ్‌ చేసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కబాబ్‌లుగా ఒత్తుకుని పెనంపై మిగిలిన నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి. తరిగిన ఉల్లిపాయలు, పుదీనా ఆకులతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2022-02-26T16:59:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising