ఆవకాయ
ABN, First Publish Date - 2022-05-28T19:36:43+05:30
చిన్నరసాల మామిడికాయలు - 12, జల్లించిన ఆవపిండి - ముప్పావు కప్పు, దంచిన రాళ్ల ఉప్పు
కావలసినవి: చిన్నరసాల మామిడికాయలు - 12, జల్లించిన ఆవపిండి - ముప్పావు కప్పు, దంచిన రాళ్ల ఉప్పు - ఒక కప్పు, కారం - ఒక కప్పు, మెంతులు - ఒక టీస్పూన్, నువ్వుల నూనె - రెండు కప్పులు, ఇంగువ - కొద్దిగా, పసుపు - ఒక టీస్పూన్.
తయారీ విధానం: ముందుగా మామిడికాయలు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ముక్కలుగా కట్ చేసుకోవాలి. టెంక, తెల్లటి పొర తీసేయాలి. కొలత కోసం ఒక గ్లాసు తీసుకుని ఉప్పు, కారం, ఆవపిండిని ఒక పాత్రలో వేసి బాగా కలుపుకొని పసుపు, ఇంగువ, మెంతులు కూడా జోడించి కలిపి పెట్టుకోవాలి. మరొక పాత్రలో నూనె పోసి మామిడికాయ ముక్కలు కొన్ని కొన్ని వేస్తూ మరో పాత్రలోకి తీసుకోవాలి. తరువాత వాటిని కారం, ఆవపిండి కలిపి పెట్టుకున్న పాత్రలో వేసి కలుపుకోవాలి. రెండు రోజుల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.మూడో రోజు మూత తీసి మరికొద్దిగా నూనె కలిపి సీసాల్లో నింపుకోవాలి. అంతే... ఘుమఘుమలాగే ఆవకాయ రెడీ.
Updated Date - 2022-05-28T19:36:43+05:30 IST