ఆలూ బఠానీ చాట్
ABN, First Publish Date - 2022-04-15T18:01:14+05:30
తెల్ల బఠానీలు- కప్పు, ఆలుగడ్డలు- మూడు, ఉల్లి- ఒకటి, పసుపు - అర స్పూను, కారం- రెండు స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు- 12, అల్లం- చిన్న ముక్క, టొమాటో ముక్కలు
కావలసిన పదార్థాలు: తెల్ల బఠానీలు- కప్పు, ఆలుగడ్డలు- మూడు, ఉల్లి- ఒకటి, పసుపు - అర స్పూను, కారం- రెండు స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు- 12, అల్లం- చిన్న ముక్క, టొమాటో ముక్కలు - కప్పు, చాలా మసాలా- స్పూను, చక్కెర - అర స్పూను, చాట్ మసాలా- స్పూను, చింతపండు రసం- అర స్పూను, దనియాల పొడి, గరం మసాలా - స్పూను, కొత్తిమీర తరుగు- స్పూను, ఉప్పు, నూనె- తగినంత.
తయారుచేసే విధానం: ముందుగా తెల్ల బఠానీలను రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. ప్రెషర్ కుక్కర్‌లో బఠానీలు, ఆలుగడ్డ, పసుపు, ఉప్పు, రెండు కప్పుల నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చాక దించాలి. అల్లం, వెల్లుల్లి రెబ్బలు, కొన్ని టొమాటో ముక్కలు, చాట్ మసాలా, చక్కెర, కారం, ఉప్పు, జీలకర్ర పొడి మిక్సీలో వేసి చట్నీలా రుబ్బుకోవాలి. పెద్ద బాణలిలో నూనె వేసి జీలకర్ర, మెంతులు చిటపటలాడించాలి. ఉల్లి ముక్కలు కలపాలి. రుబ్బిన చట్నీని జతచేయాలి. మిగతా టొమాటో ముక్కలూ వేయాలి. జీలకర్ర పొడి, పసుపు, ధనియాల పొడి, కారం, గరం మసాలా, ఉప్పు కలపాలి. అయిదు నిమిషాల తరవాత ఉడికించిన ఆలుగడ్డనూ మెత్తగా చేసి వేయాలి. అన్నిటినీ బాగా కలిపాక బఠానీలను జతచేసి మూత పెట్టి కాస్త మగ్గించాలి. చాట్ మసాలా, కొత్తిమీర చల్లితే ఆలూ మటర్ చాట్ రెడీ. అవసరమైతే పైన ఉల్లి, కీరా, టొమాటో ముక్కలు, పాప్డి వేసుకుని తింటే ఆ రుచే వేరు. నిమ్మరసం కూడా పిండుకోవచ్చు.
Updated Date - 2022-04-15T18:01:14+05:30 IST