ఆవాల ఆకుల కర్రీ
ABN, First Publish Date - 2022-01-01T19:35:18+05:30
పంజాబ్‌తో పాటు కొన్ని ఉత్తర భారత రాష్ట్రాల్లో ఇది ఫేమ్‌స్ వింటర్ ఫుడ్. ఆవ ఆకులతో చేసే ఈ వంటకంలో పీచుపదార్థంతోపాటు ఫైటోన్యూట్రియెంట్స్ లభిస్తాయి. ఈ వంటకం తయారుచేసుకోవడానికి...
పంజాబ్‌తో పాటు కొన్ని ఉత్తర భారత రాష్ట్రాల్లో ఇది ఫేమ్‌స్ వింటర్ ఫుడ్. ఆవ ఆకులతో చేసే ఈ వంటకంలో పీచుపదార్థంతోపాటు ఫైటోన్యూట్రియెంట్స్ లభిస్తాయి. ఈ వంటకం తయారుచేసుకోవడానికి...
కావలసినవి: ఆవాల ఆకులు - నాలుగు కట్టలు చిన్నవి, పాలకూర - రెండు కట్టలు, పచ్చిమిర్చి - మూడు, మొక్కజొన్న పిండి - ఒక కప్పు, నెయ్యి - మూడు టేబుల్‌స్పూన్లు, దంచిన అల్లం - రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి - నాలుగైదు, ఉల్లిపాయలు - రెండు, వెన్న - ఒక టేబుల్‌స్పూన్.
తయారీ విధానం: ఆవాల ఆకులను, పాలకూరను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నగా తరగాలి. స్టవ్‌పై ఒక పాత్రను పెట్టి అర లీటరు నీళ్లు పోసి మరిగించాలి. అందులో కట్ చేసిన పెట్టుకున్న ఆకుకూరలు వేయాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చిలో సగం వేయాలి. మూత పెట్టి చిన్నమంటపై ఇరవై నిమిషాలు మరిగించాలి. పాత్రను దించి అందులో మొక్కజొన్న పిండి కొద్దికొద్దిగా వేస్తూ కలియబెట్టాలి. మెత్తటి పేస్టులా తయారయ్యేలా కలుపుకోవాలి. మరొక పాత్రలో నెయ్యి వేసి అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేయించాలి. తరువాత అందులో పేస్టులా తయారుచేసి పెట్టుకున్న మిశ్రమం కలపాలి. మరో పావుగంట పాటు ఉడికించాలి. తగినంత ఉప్పు వేసుకుని దింపుకోవాలి. పైన వెన్న వేసి వేడి వేడి కర్రీ సర్వ్ చేసుకోవాలి.
Updated Date - 2022-01-01T19:35:18+05:30 IST