పెసర వడలు
ABN, First Publish Date - 2022-04-09T17:18:36+05:30
పెసరపప్పు - కప్పు, బియ్యప్పిండి - మూడు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి, - మూడు, అల్లం
కావలసినవి: పెసరపప్పు - కప్పు, బియ్యప్పిండి - మూడు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి, - మూడు, అల్లం - చిన్నముక్క, ఉల్లిపాయ - ఒకటి, కొత్తిమీర - కొద్దిగా, జీలకర్ర - ఒక టీస్పూన్, ఉప్పు - రుచికి తగినంత, బేకింగ్ సోడా - పావు టీస్పూన్
తయారీ విధానం: పెసరపప్పులో నీళ్లు పోసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత నీళ్లు తీసేసి పప్పును మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవాలి. ఈ పప్పును ఒక బౌల్‌లోకి తీసుకుని అందులో బియ్యప్పిండి, పచ్చిమిర్చి, దంచిన అల్లం, తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర, జీలకర్ర, తగినంత ఉప్పు, బేకింగ్ సోడా వేసి చిక్కటి మిశ్రమంలా కలుపుకోవాలి. స్టవ్‌పై కడాయి పెట్టి నూనె పోసి వేడి అయ్యాక మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని వడల్లా ఒత్తుకుంటూ నూనెలో వేసుకోవాలి.డీప్ ఫ్రై అయ్యాక తీసి సర్వ్ చేసుకోవాలి.
Updated Date - 2022-04-09T17:18:36+05:30 IST