ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సగ్గుబియ్యం దోశలు

ABN, First Publish Date - 2022-09-27T19:21:40+05:30

ముందుగా సగ్గుబియ్యాన్ని కడిగి గంటన్నర పాటు నానబెట్టుకోవాలి. తరువాత మిక్సీలో వేసి మెత్తగా పట్టుకుని బౌల్‌లోకి తీసుకోవాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి:

సగ్గుబియ్యం - ఒక కప్పు, బొంబాయి రవ్వ - అరకప్పు, పెరుగు - మూడు టీస్పూన్లు, ఉల్లిపాయ - ఒకటి, కొత్తిమీర - ఒకకట్ట, ఉప్పు - తగినంత, జీలకర్ర - అర టీస్పూన్‌, కరివేపాకు - రెండు రెమ్మలు, పచ్చిమిర్చి - నాలుగు. 


తయారీ విధానం: 

ముందుగా సగ్గుబియ్యాన్ని కడిగి గంటన్నర పాటు నానబెట్టుకోవాలి. 

తరువాత మిక్సీలో వేసి మెత్తగా పట్టుకుని బౌల్‌లోకి తీసుకోవాలి.  

తరువాత అందులో బొంబాయి రవ్వ, పెరుగు వేసి బాగా కలపాలి. 

కొద్దిగా నీళ్లు వేసి చిక్కటి పిండిలా కలుపుకోవాలి. 

ఈ మిశ్రమాన్ని పావుగంట పాటు పక్కన పెట్టుకోవాలి.  

ఇప్పుడు ఆ మిశ్రమంలో జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, దంచిన పచ్చిమిర్చి, రుచికి తగిన ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. 

మిశ్రమం మరీ పలుచగా, మరీ చిక్కగా కాకుండా చూసుకోవాలి.  

స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి, పాన్‌ అంతటా రాసి మిశ్రమాన్ని దోశలా పోసుకోవాలి. 

చిన్నమంటపై కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తరువాత మరోవైపు తిప్పి కాల్చుకోవాలి.  

బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఈ దోశలు సర్వ్‌ చేసుకోవచ్చు.

Updated Date - 2022-09-27T19:21:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising