ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోయా మంచూరియ

ABN, First Publish Date - 2022-05-21T23:18:02+05:30

ఎప్పుడూ గోబీ మంచూరియా తింటే బోర్‌ కొడుతుంది. అందుకే ఈ సారి ఇంట్లో సోయా మంచూరియా ట్రై చేయండి. చికెన్‌ కబాబ్స్‌ ప్రతివారం తింటూనే ఉంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోయాతో స్పెషల్‌గా...

ఎప్పుడూ గోబీ మంచూరియా తింటే బోర్‌ కొడుతుంది. అందుకే ఈ సారి ఇంట్లో సోయా మంచూరియా ట్రై చేయండి. చికెన్‌ కబాబ్స్‌ ప్రతివారం తింటూనే ఉంటారు. కాబట్టి ఈవారం సోయా కబాబ్స్‌ తినండి. సోయాతో చేసే అలాంటి కొన్ని వంటల తయారీ విశేషాలు ఇవి...


కావలసినవి: సోయా- ఒక కప్పు, మైదా- నాలుగు టేబుల్‌స్పూన్లు, నూనె - సరిపడా, ఉప్పు - తగినంత, కొత్తిమీర- ఒక కట్ట, స్ర్పింగ్‌ ఆనియన్స్‌- కొద్దిగా, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి - నాలుగైదు రెబ్బలు, పచ్చిమిర్చి - నాలుగు, ఉల్లిపాయ - ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్టు - అర టీస్పూన్‌, కార్న్‌ఫ్లోర్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, కారం - అర టీస్పూన్‌, వెనిగర్‌ - ఒక టీస్పూన్‌, గ్రీన్‌ చిల్లీసాస్‌ - ఒక టీస్పూన్‌, డార్క్‌ సోయాసాస్‌ - ఒక టీస్పూన్‌, టొమాటో సాస్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, కార్న్‌స్టార్చ్‌ - ఒక టేబుల్‌స్పూన్‌.


తయారీ విధానం: ముందుగా స్టవ్‌పై ఒక పాత్రలో నీళ్లు పెట్టి మరుగుతున్న సమయంలో సోయాబాల్స్‌ వేసి రెండు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.తరువాత మరొక వెడల్పాటి పాత్రలో చల్లటి నీళ్లు తీసుకోవాలి. వేడి నీళ్లలో నుంచి సోయాను తీస్తూ చల్లటి నీళ్లలో వేయాలి.చల్లారిన తరువాత సోయా బాల్స్‌ని చేతుల్లోకి తీసుకుంటూ నీళ్లను పిండేయాలి.అలా నీళ్లను పిండేసిన సోయాముక్కలను ఒక బౌల్‌లోకి తీసుకుని అందులో మైదా, కార్న్‌ఫ్లోర్‌, కారం, అల్లంవెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు చిలకరించి సోయా ముక్కలకు పిండి బాగా పట్టేలా కలుపుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక ఆ సోయా ముక్కలను వేసి వేయించాలి. గోధుమరంగులోకి మారే వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.స్టవ్‌పై మరొక పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి తరిగిన వెల్లుల్లి రెబ్బలు, దంచిన అల్లం, పచ్చిమిర్చి, స్ర్పింగ్‌ ఆనియన్స్‌, ఉల్లిపాయలు వేసి వేయించాలి.కొద్దిగా కారం, కాస్త ఉప్పు వేసుకోవాలి. కాసేపు వేగిన తరువాత ఒక చిన్నకప్పులో కార్న్‌స్టార్చ్‌ తీసుకుని కొన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకొని పోయాలి. తరువాత వెనిగర్‌, చిల్లీ సాస్‌, డార్క్‌ సోయా సాస్‌, టొమాటో సాస్‌ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న సోయా వేసి కాసేపు వేయించుకోవాలి. కొత్తిమీర వేసుకుని దింపుకొని సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2022-05-21T23:18:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising