ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jagananna Houses : జగనన్నా.. ఇళ్లేవీ?

ABN, First Publish Date - 2023-07-07T03:59:06+05:30

ఎన్నికల ముందే కాదు అధికారంలోకి వచ్చాక కూడా ముఖ్యమంత్రి జగన్‌ ఎన్నో హామీలు ఇచ్చారు. ఫలానా గడువులోగా పూర్తి చేస్తామని కూడా గొప్పలు చెప్పారు. అయితే ఆయన చెప్పిన వాటిలో చాలా వరకు నెరవేర్చలేదు. పేదల ఇళ్ల నిర్మాణం పరిస్థితి కూడా ఇంతే. ఐదేళ్లలో 30 లక్షల ఇళ్లు నిర్మించాలని జగన్‌ సర్కారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పేదల ఇళ్ల నిర్మాణంపై సర్కారు కట్టుకథలు

నాలుగేళ్లలో కేవలం 7 శాతమే.. మరో 26 లక్షల ఇళ్లు ఎప్పుడో?

మొదట్నుంచీ సర్కారుపై విమర్శలే.. పట్టాలు వెనక్కి ఇచ్చిన లక్ష మంది

ప్రభుత్వమే ఇళ్లు నిర్మిస్తుందని చెప్పి ఆ తర్వాత లబ్ధిదారులకు ‘ఆప్షన్లు’

ఊళ్లకు దూరంగా లే-అవుట్లు.. అదీ శ్మశానాల దగ్గర, లోతట్టు ప్రాంతాల్లో

ప్రభుత్వ లక్ష్యం ఐదేళ్లలో30లక్షలునాలుగేళ్లలో కేవలం 7 శాతమే.. మరో 26 లక్షల ఇళ్లు ఎప్పుడో? మొదట్నుంచీ సర్కారుపై విమర్శలే.. పట్టాలు వెనక్కి ఇచ్చిన లక్ష మంది ప్రభుత్వమే ఇళ్లు నిర్మిస్తుందని చెప్పి ఆ తర్వాత లబ్ధిదారులకు ‘ఆప్షన్లు’ ఊళ్లకు దూరంగా లేఅవుట్లు.. అదీ శ్మశానాల దగ్గర, లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికి నిర్మాణం పూర్తయినవి అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని జగనన్న కాలనీ ఇళ్ల దుస్థితి ఇది. కొండలు గుట్టల్లో స్థలాలు కేటాయించడంతో ఇళ్ల నిర్మాణాన్ని లబ్ధిదారులు పునాదులతోనే ఆపేశారు. కాలనీలకు వెళ్లేందుకు దారి లేక.. నీటి సదుపాయం లేక నిర్మాణాలను నిలిపివేశారు. ఇదే విషయాన్ని అధికారులకు మొరపెట్టుకోగా.. మీకు స్థలాలైనా ఇచ్చారు సంతోషించండి.. చాలాచోట్ల అవి కూడా లేవని సమాధానమిచ్చారు.

‘ఐదేళ్లలో 30 లక్షలకు పైగా ఇళ్లు నిర్మించి పేదలకు అందజేస్తాం’... సీఎం అయిన తొలినాళ్లలో జగన్‌ ఆర్భాటంగా చేసిన ప్రకటన ఇది. నాలుగేళ్లు గడిచిపోయాయి. 4 లక్షల ఇళ్లే పూర్తయ్యాయి. అవి కూడా చాలా వరకు ఆర్థిక స్తోమత ఉన్న వారు నిర్మించుకున్నవే. జగన్‌ చెప్పినట్టు గడువులోగా మరో 26 లక్షల ఇళ్ల నిర్మాణం సాధ్యమయ్యే పనేనా? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న!

2020లో తొలివిడతగా 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. మరో 15 లక్షలకు పైగా ఇళ్లను 2021లోగా పూర్తి చేస్తామని చెప్పారు. ఆ తర్వాత... ఈ ఏడాది మార్చి నాటికి కనీసం 5 లక్షల ఇళ్లయినా పూర్తి చేసి ఉగాది రోజు సామూహిక గృహప్రవేశాలు చేయించాలని హడావుడి చేశారు. ఇలా గడువులు మారుతున్నాయే తప్ప లక్ష్యం మాత్రం చేరుకోలేదు.

అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని జగనన్న కాలనీ ఇళ్ల దుస్థితి ఇది. కొండలు గుట్టల్లో స్థలాలు కేటాయించడంతో ఇళ్ల నిర్మాణాన్ని లబ్ధిదారులు పునాదులతోనే ఆపేశారు. కాలనీలకు వెళ్లేందుకు దారి లేక.. నీటి సదుపాయం లేక నిర్మాణాలను నిలిపివేశారు. ఇదే విషయాన్ని అధికారులకు మొరపెట్టుకోగా.. మీకు స్థలాలైనా ఇచ్చారు సంతోషించండి..

చాలాచోట్ల అవి కూడా లేవని సమాధానమిచ్చారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఎన్నికల ముందే కాదు అధికారంలోకి వచ్చాక కూడా ముఖ్యమంత్రి జగన్‌ ఎన్నో హామీలు ఇచ్చారు. ఫలానా గడువులోగా పూర్తి చేస్తామని కూడా గొప్పలు చెప్పారు. అయితే ఆయన చెప్పిన వాటిలో చాలా వరకు నెరవేర్చలేదు. పేదల ఇళ్ల నిర్మాణం పరిస్థితి కూడా ఇంతే. ఐదేళ్లలో 30 లక్షల ఇళ్లు నిర్మించాలని జగన్‌ సర్కారు లక్ష్యం పెట్టుకోగా... నాలుగేళ్లలో 7 శాతం ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది. గురువారం గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులే ఈ విషయం చెప్పారు. ప్రస్తుతానికి 4 లక్షల ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తయినట్టు వెల్లడించారు. అంటే.. ఇంకా 26 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం (93 శాతం) పూర్తి చేయాల్సి ఉంది. పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు చూడకుండా అర్హులైన పేదలందరికీ ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లు నిర్మిస్తామని వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు స్థలాలు ఇస్తామని, వాటిలో ఇళ్లు కట్టించి లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయిస్తామని, ఒక్కో లబ్ధిదారుడికి రూ.2 లక్షల నుంచి 5 లక్షల మేర లబ్ధి చేకూరుతుందని గొప్పలు చెప్పారు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 25 లక్షలు కాదు.. ఐదేళ్లలో ఏకంగా 30.75 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని ఘనంగా ప్రకటించారు. ‘ఇది రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే ప్రప్రథమంగా జగనన్న లిఖిస్తున్న సరికొత్త అధ్యాయం.. ఇళ్లు లేనివారు ఉండకూడదనే మహత్తర లక్ష్యం నెరవేరుస్తున్న సమయం.. లక్షలాది నిరుపేదల కలల సాకారం కోసం కడుతున్నవి ఇళ్లు కావు.. ఊళ్లు’ అంటూ నాలుగేళ్లుగా ప్రభుత్వం రూ.కోట్ల ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తూ ప్రచారం చేసుకుంటోంది. క్షేత్రస్థాయిలో చూస్తే పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.

మాట మార్చి... ఆప్షన్లు

రాష్ట్ర ప్రభుత్వం 2020లో తొలివిడతగా 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వాటిని ఏడాదిలో పూర్తి చేసి, మరో 15 లక్షలకు పైగా ఇళ్లను రెండో విడతగా 2021లోగా పూర్తి చేస్తామని ప్రకటించింది. ఆ తర్వాత ఇళ్ల నిర్మాణ విషయంలో ప్రభుత్వం మాట మార్చింది. ఇళ్లను లబ్ధిదారులు నిర్మించుకుంటే బిల్లులు ఇస్తామని, పూర్తి పెట్టుబడి లేనివారికి నిర్మాణ సామగ్రి (మెటీరియల్‌) అందిస్తామని, సొంతంగా ఇళ్లు నిర్మించుకోలేనివారికి ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందంటూ మూడు ఆప్షన్లు ఇచ్చింది. ఈ ఆప్షన్ల గందరగోళంతో పేదల ఇళ్ల నిర్మాణం పునాదులు దాటడం లేదు. ప్రభుత్వ పెద్దల హామీలను నమ్మి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుని ఇళ్లు నిర్మించుకున్న పేదలకు సక్రమంగా బిల్లులు మంజూరు కావడం లేదు. మెటీరియల్‌ కోరినవారికి సకాలంలో ఇవ్వకపోగా నాసిరకం మెటీరియల్‌ అంటగడుతున్నారు. ఇక మూడో ఆప్షన్‌ ఎంపిక చేసుకున్నవారికి కాంట్రాక్టర్ల ద్వారా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఇలాంటి కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా పేదల ఇళ్ల నిర్మాణం త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతోంది. తొలివిడతలో నిర్మాణం చేపట్టిన 15 లక్షల పైచిలుకు ఇళ్లలో ఇప్పటి వరకు 4 లక్షల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 26 లక్షల పైచిలుకు ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందని అధికారులు చెబుతున్నారు.

ఉగాది కూడా పోయె...

వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కనీసం 5 లక్షల ఇళ్లనైనా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది మార్చి నాటికే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, ఒకేరోజు ఉగాది నాడు లబ్ధిదారులందరితో సామూహిక గృహప్రవేశాలు చేయించాలని హడావుడి చేసింది. ఇందుకోసం గృహ నిర్మాణ శాఖ అధికారులు లబ్ధిదారులపై ఒత్తిడి పెంచారు. ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులు యుద్ధప్రాతిపదికన మొదలు పెట్టాలని, లేకపోతే ప్రభుత్వం మంజూరు చేసిన స్థలాలను వెనక్కి తీసుకుంటామని బెదిరించారు. దీంతో చాలా చోట్ల లబ్ధిదారులు ఎదురుతిరిగారు. ప్రభుత్వం ఇచ్చే రాయుతీ రూ.1.80 లక్షలు, బ్యాంకు రుణం రూ.35 వేలు పునాదులకు కూడా సరిపోవని, ఇళ్లు కట్టుకోవాలంటే తాము అప్పులపాలు కావాల్సి వస్తుందని వాదనకు దిగారు. ఈ నేపథ్యంలో ఉగాది పండగ నాటికి పెట్టుకున్న లక్ష్యం కూడా నెరవేరలేకపోయింది. దీంతో సామూహిక గృహ ప్రవేశాల ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టేసింది.

ధరల ప్రభావం: గృహ నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరగడం కూడా ఇళ్ల నిర్మాణంపై ప్రభావం పడింది. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్‌లో కొంత గృహ నిర్మాణ శాఖ సరఫరా చేస్తున్నా... మిగిలిన నిర్మాణ వస్తువుల కొనుగోలు లబ్ధిదారులపై ఆర్థిక భారాన్ని పెంచింది. జగన్‌ ప్రభుత్వం రాకముందు స్టీల్‌ ధర టన్ను సుమారు రూ.46 వేలు ఉండగా... ఈ నాలుగేళ్లలో క్రమంగా రూ.80 వేలు దాటిపోయింది. మరోవైపు సిమెంట్‌ ధరలు కూడా బ్రాండ్‌ను బట్టి బస్తాపై సుమారు రూ.5080 వరకు పెరిగిపోయాయి. ప్రభు త్వం ఇచ్చే రూ.1.80 లక్షలు చాలకపోవడం, మరోవైపు నిర్మాణ వ్యయం పెరగడం తీవ్ర ప్రభావం చూపుతోంది. గృహ నిర్మాణ శాఖ సామగ్రి ఇస్తున్నప్పటికీ వాటిని తీసుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో జగనన్న ఇళ్ల నిర్మాణం ఆశించిన రీతిలో ముందుకు సాగడం లేదని అధికారులే చెబుతున్నారు.

ఇదీ జగనన్న లేఅవుట్ల పరిస్థితి

ఇళ్ల స్థలాలు లేని పేదలకు జగనన్న కాలనీల పేరుతో వేసిన లేఅవుట్లు చాలా వరకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయి. చిన్నపాటి వర్షాలకే అవి చెరువులుగా మారుతున్నాయి. అక్కడ ఇళ్లు నిర్మించుకునేందుకు అనువైన పరిస్థితులు లేకపోవడంతో లబ్ధిదారులు ముందుకు రావడం లేదు.

ఇళ్ల స్థలాల లేఅవుట్లు ఊరికి దూరంగా, శ్మశానాలకు దగ్గరగా, నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో ఉన్నాయి. మరికొన్ని కోర్టు వివాదాల్లో చిక్కుకున్నాయి. అక్కడ ఇళ్లు నిర్మించుకుని కాపురాలు చేసే పరిస్థితి లేదంటూ లబ్ధిదారులు ఇళ్ల పట్టాలను వెనక్కి ఇచ్చేస్తున్నారు. ఇప్పటివరకు లక్ష మందికి పైగా ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను తిరిగి ఇచ్చేశారు.

Updated Date - 2023-07-07T03:59:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising