ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Temperature: కడపలో 40 డిగ్రీలు

ABN, First Publish Date - 2023-04-07T21:32:55+05:30

వేసని ఇంకా రాకముందే భాను డి భగభగలు మొదలయ్యాయి. ఈ ఏడాది వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే అంతర్జాతీయ వాతావరణ సంస్థలు ప్రకటించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విశాఖపట్నం: వేసని ఇంకా రాకముందే భాను డి భగభగలు మొదలయ్యాయి. ఈ ఏడాది వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే అంతర్జాతీయ వాతావరణ సంస్థలు ప్రకటించాయి. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో దేశంలో ఎండలు ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. మధ్య భారతం నుంచి దక్షిణ భారతం వరకు విస్తరించిన ద్రోణి బలహీనపడడంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరిగింది. పశ్చిమ దిశగా వస్తున్న పొడిగాలులతో వాతావరణం వేడెక్కింది. శుక్రవారం కడప (Kadapa)లో 40, అనంతపురం (Anantapur)లో 39.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో ఎండలు పెరుగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కాగా శుక్రవారం కోస్తా, రాయలసీమ (Rayalaseema)లో ఒకటి, రెండుచోట్ల తేలికపాటి జల్లులు కురవగా మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా నెలవారీ సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికంగా నమోదయ్యా యి. 1901వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో మార్చి నెలలో సైతం ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరతాయని అంచనా వేస్తున్నారు.

Updated Date - 2023-04-07T21:32:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising