ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చీకటి జీవోపై ఆగ్రహ జ్వాల

ABN, First Publish Date - 2023-01-05T03:13:52+05:30

రాష్ట్రంలోని రహదారులు, కూడళ్లలో సభలు, ర్యాలీలను నిషేధిస్తూ వైసీపీ సర్కారు తీసుకొచ్చిన జీవో నంబరు 1పై ఆందోళనలు కొనసాగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గర్జించిన విపక్షాలు.. జిల్లాల్లో నిరసనల వెల్లువ

ఎక్కడికక్కడ జీవో-1 ప్రతుల దహనం

అనంతపురం అర్బన్‌, కర్నూలు, భీమవరం/ఏలూరు, జనవరి 4: రాష్ట్రంలోని రహదారులు, కూడళ్లలో సభలు, ర్యాలీలను నిషేధిస్తూ వైసీపీ సర్కారు తీసుకొచ్చిన జీవో నంబరు 1పై ఆందోళనలు కొనసాగుతున్నాయి. బుధవారం పలు జిల్లాల్లో వైసీపీ మినహా మిగిలిన అన్ని పార్టీలు నిరసనలు తెలిపాయి. భావప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా ఉందంటూ జీవో1 ప్రతులను కూడళ్లలో దహనం చేశాయి. అనంతపురం అర్బన్‌, ధర్మవరం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, గుత్తి పట్ణణాల్లో టీడీపీ నేతలు నిరసనలు తెలిపి జీవో ప్రతులను దహనం చేశారు. రాయదుర్గంలో టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు నిరసన తెలిపారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోనూ టీడీపీ, జనసేన, సీపీఎం, సీపీఐ సహా వివిధ ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు నిరసనల హోరెత్తించారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. సీపీఐ ఆధ్వర్యంలో భీమవరంలో, నరసాపురంలో ఏఐటీయూసీ, సీపీఐ నాయకులు జీవో ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. పెంటపాడు, కాళ్ల మండలం పెదఅమిరంలో టీడీపీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే మంతెన రామరాజు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఏలూరు పాతబస్టాండ్‌ వద్ద టీడీపీ నేతలు జీవో ప్రతులను దహనం చేశారు. నల్లరిబ్బన్లు కళ్లకు కట్టుకుని నిరసన తెలిపారు.

Updated Date - 2023-01-05T03:13:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising