మత్స్యకారుల వలలో బంగారు తాబేలు!
ABN, First Publish Date - 2023-07-08T04:06:20+05:30
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలంలోని కల్లుమర్రి చెరువులో శుక్రవారం మత్స్యకారులకు అరుదైన తాబేలు చిక్కింది. గ్రామానికి చెందిన కొందరు యువకులు చెరువులో వల వేయగా
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలంలోని కల్లుమర్రి చెరువులో శుక్రవారం మత్స్యకారులకు అరుదైన తాబేలు చిక్కింది. గ్రామానికి చెందిన కొందరు యువకులు చెరువులో వల వేయగా చేపలతోపాటు తాబేలు పడింది. ఆ తాబేలు బంగారు రంగులో ఉంది. దానిని చూసి మత్స్యకారులు ఆశ్చర్యపోయారు. ఆ తాబేలు పలువురు పూజలు చేశారు. ఏదైనా దేవస్థానానికి సంబంధించిన కోనేరులో ఆ తాబేలును వదలాలని మత్స్యకారులు నిర్ణయించుకున్నారు.
- మడకశిర రూరల్
Updated Date - 2023-07-08T04:06:20+05:30 IST