ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP votes : టీడీపీ ఓట్లపై గురి!

ABN, First Publish Date - 2023-12-12T03:58:23+05:30

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అధికార పార్టీ నేతల అండతో అక్రమార్కులు ధిక్కరిస్తున్నారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్ల

ఇప్పటికీ ఆగని అక్రమాలు

పర్చూరులో ఇబ్బడి ముబ్బడిగా ఫామ్‌-7లు

ఈ నెల 1 నుంచి 9 వరకు ఏకంగా 7,500

35 మంది ఒక్కొక్కరు 30-40 వరకు దాఖలు

వారంతా వైసీపీ సానుభూతిపరులని ఆరోపణ

ఒక వ్యక్తి ఐదుకు మించి నమోదు చేయరాదన్న

ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు బుట్టదాఖలు

బాపట్ల, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అధికార పార్టీ నేతల అండతో అక్రమార్కులు ధిక్కరిస్తున్నారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఒక వ్యక్తి ఫామ్‌-7లను ఐదుకు మించి దరఖాస్తు చేయడానికి వీల్లేదని ఈసీ ఆదేశించినా ఇష్టానుసారం దాఖలు చేస్తున్నారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోనే ఈ నెల 1 నుంచి 9 వరకు ఏకంగా 7,500 ఫామ్‌-7లు దాఖలయ్యాయి. దాదాపు 35 మంది ఒక్కొక్కరు 30 నుంచి 40 వరకు దరఖాస్తులు చేశారు. వారంతా వైసీపీ సానుభూతిపరులేనని టీడీపీ ఆరోపిస్తోంది. గతంలో పర్చూరు నియోజకవర్గ పరిధిలో ఇబ్బడిముబ్బడిగా ఫామ్‌-7లు దరఖాస్తు చేయడంతో ఈఆర్‌వో ఫిర్యాదు మేరకు 18 మందిపై కేసులు నమోదు చేశారు. గత మూడు నెలల వ్యవధిలో ఫామ్‌-7ల బాగోతంపై ఎన్నికల కమిషన్‌ పలుమార్లు ఆదేశాలిచ్చింది. నిబంధనలు అతిక్రమించేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. ఇక ప్రతిపక్ష టీడీపీ ఫామ్‌-7ల ద్వారా తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని ఈసీ గడప తొక్కుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పదిరోజుల క్రితం ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసినా అధికార పార్టీ నేతల అండతో అక్రమార్కులు బరితెగిస్తున్నారు. ఈ విషయంలో ఈసీ ఉదాసీనంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో 18 మందిపై మొక్కుబడిగా కేసులు నమోదు చేసి సరిపెట్టారే తప్ప కఠిన చర్యల దిశగా అడుగులు పడకపోవడం అక్రమార్కులు మరింత పేట్రేగిపోవడానికి ఆస్కారమిచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా ఓ వ్యక్తి ఐదుకు మించి ఫామ్‌-7లు దరఖాస్తు చేయకూడదనే ఆదేశాలలో స్పష్టత లేకపోవడం మరో కారణమని చెబుతున్నారు. ఆ ఆదేశాలు కేవలం మాన్యువల్‌గా ఇచ్చే దరఖాస్తులకు తప్ప ఆన్‌లైన్‌లో వర్తించలేదని అధికారులు చెబుతున్నారు. మాన్యువల్‌గా కూడా గంపగుత్తగా ఫామ్‌-7లు వచ్చాయని యంత్రాంగమే చెప్పడం కొసమెరుపు.

పర్చూరులోనే 23 వేల ఫామ్‌-7లు

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి ఒక్క పర్చూరు నియోజకవర్గంలోనే ఇప్పటివరకు దాదాపు 23,000 వరకు ఫామ్‌-7లు రాగా, ఇందులో ముసాయిదా విడుదల నాటికి 14,000 ఉన్నాయి. అక్టోబరు 27న ముసాయిదా జాబితాను ఈసీ విడుదల చేసింది. అక్టోబరు 27 నుంచి నవంబరు 30 వరకు పర్చూరు నియోజకవర్గంలో 1,500 ఫామ్‌-7లు దాఖలైతే, ఈ నెల 1 నుంచి 9 వరకు 7,500 దరఖాస్తులు దాఖలవడం గమనార్హం. ‘ఈ నెల 9తో గడువు అయిపోతోంది. పెద్ద ఎత్తున ఫామ్‌-7లు పెట్టేద్దాం’ అన్నట్లు పాలక పార్టీ ఓట్ల అక్రమాలకు తెరలేపింది. పర్చూరు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 1 నుంచి 9వ తేదీ వరకు వైసీపీ సానుభూతిపరుల చేత భారీగా ఫామ్‌-7లు పెట్టించే కార్యక్రమం చేపట్టినట్టు సమాచారం.

ఇంకా ఫ్రీజ్‌ చేయలేదు

అభ్యంతరాల స్వీకరణకు ఈసీ ఇచ్చిన గడువు ఈ నెల 9తో ముగిసింది. కానీ ఇంకా ఆ సైట్‌ను ఫ్రీజ్‌ చేయకపోవడంతో గంపగుత్తగా ఫామ్‌-7లు ఇంకా పెడుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం వరకు వైసీపీ శ్రేణులు ఆన్‌లైన్‌లో పనిగట్టుకుని దరఖాస్తు ప్రక్రియను చేస్తూనే ఉన్నారు. ఈ నెల 9 తర్వాత దాఖలయినవి 1,000 వరకు ఉన్నట్లు సమాచారం. అయితే నిబంధనల ప్రకారం గడువు దాటిన తర్వాత దాఖలయిన వాటిని పరిగణనలోకి తీసుకోబోమని అధికారులు చెబుతున్నారు. పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. అవసరమైతే మళ్లీ ఫామ్‌-7లు దరఖాస్తు చేస్తామని చెప్పారు. అన్నట్లుగానే ఒక ప్రణాళిక ప్రకారం టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించడానికి వైసీపీ సానుభూతిపరుల చేత భారీగా నమోదు చేయించారు. అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నా, ఈసీ ఆదేశాలు ఇసున్నా ఏ మాత్రం లెక్క చేయకుండా అడ్డగోలుగా ఓట్ల జాబితా సవరణ ప్రక్రియను అపహాస్యం చేసేలా పాలకపార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు.

Updated Date - 2023-12-12T03:58:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising