ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వడ్డెర హక్కుల సాధనకు సమష్టి పోరాటం

ABN, First Publish Date - 2023-06-07T00:11:32+05:30

వడ్డెర్లందరూ సమష్టి పోరాటం చేసి హక్కులను సాదిద్దామని ఉమ్మడి అనంతపురం జిల్లా వడ్డెరసంఘం నాయకులు పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా వడ్డెర సంఘం నాయకుల పిలుపు

పుట్టపర్తిరూరల్‌, జూన 6: వడ్డెర్లందరూ సమష్టి పోరాటం చేసి హక్కులను సాదిద్దామని ఉమ్మడి అనంతపురం జిల్లా వడ్డెరసంఘం నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని గంటలమారెమ్మ అలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సంఘం అధ్యక్షులు దళవాయి వెంకటనారాయణ, జరిపిటి కృష్ణమూర్తి, గౌరవాధ్యక్షులు సిమెంట్‌ పోలన్న మాట్లాడారు. వడ్డెర్లు ఆర్థిక, రాజకీయ, సామాజికంగా వెనుకబడ్డారని, దుర్భరజీవితం అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పొరుగు రాషా్ట్రల్లో వడ్డెర్లను ఎస్సీ, ఎస్టీలుగా గుర్తించడంతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశలో కూడా రిజర్వేషన కోసం ఉద్యమించి సాధించి తీరుతామని ప్రకటించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పార్టీలు సీట్లు కేటాయించాలని కోరారు. సమావేశంలో వడ్డెర సాధికార సమితి అధ్యక్షుడు వన్నూరప్ప, జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం ప్రధాన కార్యద ర్శి గోగుల చక్రపాణి, జాతీయ నాయకులు డాక్టర్‌ కుళ్ళాయప్ప, నాయకులు ఇందుకూరిపల్లి ఉత్తన్న, వలిపి గంగులప్ప, దండగల మారెప్ప, డీలర్‌ శ్రీనివాసులు, రామాంజనేయులు, చిన్నవెంకటరమణ, అనంద్‌, సుధాకర్‌, ఉప్పతోళ్ల సుధాకర్‌, రామచంద్ర, శ్రీరాములు, పెద్దన్న, గోరంట్ల రామాంజి, పీట్ల సుధాకర్‌, జరిపిటి అంజినప్ప పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T00:11:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising