వ్యాయామంతో ఆరోగ్యవంతమైన జీవితం
ABN, First Publish Date - 2023-06-10T00:05:29+05:30
ప్రజలు ఆరోగ్యవంతమైన జీవితం కొనసాగించాలంటే ప్రతిరోజూ క్రమం తప్పని వ్యాయామం చేయాలని, పరిమితమైన ఆహారం తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి పేర్కొన్నారు.
జిల్లా వైద్యాధికారి డాక్టర్ కృష్ణారెడ్డి
పుట్టపర్తి రూరల్, జూన 9: ప్రజలు ఆరోగ్యవంతమైన జీవితం కొనసాగించాలంటే ప్రతిరోజూ క్రమం తప్పని వ్యాయామం చేయాలని, పరిమితమైన ఆహారం తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కప్పలబండ గ్రామంలో అతిసార నియంత్రణ పక్షోత్సవాల్లో భాగంగా మాతాశిశుసంరక్షణ, వడదెబ్బ, సీజనల్‌వ్యాధులు, ఉధృత అతిసార నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలోపు చిన్నారులకు అతిసారవ్యాధి లక్షణాలు, చికిత్స గురించి వివరించారు. ఓఆర్‌ఎస్, జింక్‌మాత్రల ప్రాముఖ్యత, వినియోగం తెలియజేశారు. చేతులు, పరిసరాల పరిశుభ్రత, సురక్షితమైన నీరు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచు పెద్దన్న, వైద్యాధికారి డాక్టర్ నాగరాజ్‌నాయక్, సీహెచఓ నగేష్, ఏఎంఓ లక్ష్మానాయక్, ఎస్‌ఈఓ రమణయ్య, ఎంఎల్‌హెచపీ అపర్ణ, ఏఎనఎం ప్రమీల, ఆశావర్కర్లు, అంగనవాడీ కార్యకర్తలు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-10T00:05:29+05:30 IST