క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు
ABN, First Publish Date - 2023-04-17T23:38:34+05:30
తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని, పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడితే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని పార్టీ నియోజకవర్గ అబ్జర్వర్ పార్థసారథిరెడ్డి హె చ్చరించారు.
టీడీపీ నియోజకవర్గ అబ్జర్వర్ పార్థసారథిరెడ్డి
మడకశిరటౌన, ఏప్రిల్ 17: తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని, పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడితే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని పార్టీ నియోజకవర్గ అబ్జర్వర్ పార్థసారథిరెడ్డి హె చ్చరించారు. నియోజకవర్గంలో గుండుమల తిప్పేస్వామి నాయకత్వం లో ప్రతిఒక్కరు పనిచేయాలని సూచించారు. సోమవారం పట్టణంలో ని యాదవ కల్యాణమండపంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వ హించారు. ఈసందర్భంగా నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా గుండుమల తిప్పేస్వామి బాధ్యతలు చేపట్టారు. అనంతరం పార్థసారథి రెడ్డి మా ట్లాడుతూ ఇక నుంచి పార్టీ కార్యక్రమాలు గుండుమల ఆధ్వర్యంలోనే నిర్వహించాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ లో గందరగోళం ఏర్పడకుండా ఏకనాయకత్వంలో పనిచేయాలని తెలి పారు. గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ యుద్ధం చేసైనాసరే చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూడాలని ప్రతిఒక్కరు సంకల్పంతో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందన్నారు. 2024లో మడకశిర ని యోజకవర్గంలో పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబుకు కానుకగా ఇద్దామన్నారు. నాలుగేళ్లుగా వైసీపీ నాయకుల ఆగ డాలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటూ, వారు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా తట్టుకొన్నారని, అందరికీ పార్టీ అండగా ఉంటుందని భరో సా ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి, జి ల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు భక్తర్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు మం జునాథ్, నియోజకవర్గ అధ్యక్షుడు ఆర్ జయకుమార్, మాజీ జడ్పీటీసీ నరసింహమూర్తి, జడ్పీటీసీ ఉమేష్, మాజీ ఎంపీపీ కృష్ణమూర్తి, నా యకులు గురుమూర్తి, బాలకృష్ణ, బేగార్లపల్లి రవి, పట్టణ అధ్యక్షుడు మనోహర్, కౌన్సిలర్ ఉమాశంకర్, మాజీ మున్సిపల్ చైర్మన సుబ్బరాయుడు, తెలుగు యువత ఉపాధ్యక్షుడు కోట్ల రంగేగౌడ్ పాల్గన్నారు.
టీడీపీలోకి పెరుగుతున్న వలసలు
మడకశిర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. సోమవారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తి ప్పేస్వామి ఆధ్వర్యంలో వంద కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పసుపు కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. పాపసానిపల్లిలో 20 కుటుంబాలు, మడకశిరతోపాటు నియోజకవర్గంలో పలువురు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. లోకేష్, సాయికుమార్, రాజు, శివ, హకీంసాబ్, గంగప్ప, మాజీ మెంబర్ లక్ష్మీనరసప్ప, నాగప్ప, హనుమంతరాయప్పతోపాటు వారి అనుచరులు తెలుగుదేశం పార్టీలోకి చేరారు.
Updated Date - 2023-04-17T23:38:34+05:30 IST