గుక్కెడు నీటి కోసం పడిగాపులు
ABN, First Publish Date - 2023-04-19T00:07:05+05:30
వేసవి ఎండలు మండిపోతున్నా యి. గుక్కెడు తాగునీటి కోసం జనం అవస్థలు పడుతున్నారు. పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని కోనాపురంలో రోజు రోజుకు తాగునీటి సమస్య జటిలమవుతోంది.
కోనాపురంలో తీరని దాహార్తి
పెనుకొండ రూరల్, ఏప్రిల్ 18: వేసవి ఎండలు మండిపోతున్నా యి. గుక్కెడు తాగునీటి కోసం జనం అవస్థలు పడుతున్నారు. పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని కోనాపురంలో రోజు రోజుకు తాగునీటి సమస్య జటిలమవుతోంది. బిందెడు నీటి కోసం కొళాయిల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. తాగునీటి కోసం చిన్నారు లు పడుతున్న అగచాట్లు వర్ణనాతీతం. కోనాపురం నగర పంచాయతీ లోకి విలీనం అయినప్పటికీ గ్రామానికి రోడ్డు, తాగునీటి సమస్య తీర డం లేదని వాపోతున్నారు. మౌళిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆరోపించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యలు తీర్చడంలేదు. నగర పంచాయతీ అయుతే తమ గ్రామం అ భివృద్ధి చెందుతుందని భావించామని, అయితే ఆశలు అడియాశలవుతున్నాయని పెదవి విరుస్తున్నారు. గుక్కెడు నీటి కోసం గంటల తరబ డి కొళాయి వద్ద పడిగాపు కాయాల్సి వస్తోంది.
గ్రామంలో 500 కుటుంబాలకుపైగా నివాసముండగా, 2 వేల మంది దాకా జనాభా ఉన్నారు. గ్రామానికి నీటి సరఫరా కోసం మూడు బోరుబావులు ఏర్పాటు చేశారు. ఒక బోరుబావి మరమ్మతులకు గురైంది. మిగిలిన రెండు బోరుబావుల నుంచి వచ్చే అరకొర నీరు గ్రామానికి సరిపడటంలేదు. దీంతో తాగునీటి కోసం వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోంది. కొళాయిల నుంచి వచ్చే అరకొర నీటిని చెంబులతో పట్టుకుని, వాటిని బిందెల్లో నింపుకుని తీసుకెళ్లాల్సిన పరిస్థితి. నీటి కోసం విద్యార్థులు పడుతున్న అగచాట్లు వర్ణనాతీతం. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామానికి సక్రమంగా తాగునీరు సరఫరా చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
బిందె నీరు పట్టేందుకు
గంటల తరబడి వేచి ఉంటున్నా..
లక్కీ, బాలిక, కోనాపురం
అమ్మా, నాన్న పనికి వెళ్లా రు. స్కూల్ నుంచి ఇంటికి రా గానే తాగడానికి నీరు లేవు. దీంతో కొళాయి వద్ద వస్తున్న అరకొర నీటిని చెంబుతో పట్టుకుంటున్నా. వాటిని బిందెలో పోసుకుని తీసుకెళ్తున్నాం. కొళాయి వద్ద వస్తున్న అరకొర నీటి కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.
రేపటికల్లా తాగునీటి సమస్య పరిష్కరిస్తాం
వంశీకృష్ణభార్గవ్, కమిషనర్
నగర పంచాయతీ పరిధిలోని తాగునీటి సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తాం. కోనాపురంలో తాగునీటి సమస్య ఉన్నట్లు తెలిసింది. రేపటికల్లా నీటి సరఫరాను క్రమబద్ధీకరిస్తాం.
Updated Date - 2023-04-19T00:07:05+05:30 IST