Anantapuram: బాలకృష్ణ వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహం
ABN, First Publish Date - 2023-01-25T12:50:21+05:30
అనంతపురం: లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావుపై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతపురం: లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao)పై నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) చేసిన వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు (Fans) ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అనంతపురం ప్రెస్ క్లబ్ (Press Club) వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ మాట్లాడుతూ ఒక లెజెండరీ యాక్టర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నటుడు బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా బాలకృష్ణ చాలామందిపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. ఇప్పటి వరకు దీనిపై ‘మా’ అసోసియేషన్ (MAA Association) ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. టికెట్ల రేట్లు పెంచేందుకు మాత్రం సమావేశాలు జరుపుతారు కానీ.. ఇలాంటి వాటిపై మాట్లాడరా? అని నిలదీశారు. వెంటనే ‘మా’ అసోసియేషన్ బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించాలని కోరారు. బాలకృష్ణ క్షమాపణ చెప్పకపోతే అక్కినేని అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తారని వారు స్పష్టం చేశారు.
Updated Date - 2023-01-25T12:50:25+05:30 IST