ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పది పరీక్షలకు సర్వం సిద్ధం

ABN, First Publish Date - 2023-04-03T00:08:05+05:30

జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖాధికారులు సర్వం సిద్ధం చేశారు. పరీక్షా కేంద్రాల్లో బల్లలు, విద్యుత సరఫరా, ఫ్యానలు, బల్బులు, నీటి క్యాన్లు, ప్రథమ చికిత్స శిబిరం తదితర మౌళిక సదుపాయాలను కల్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హిందూపురం అర్బన, ఏప్రిల్‌ 2: జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖాధికారులు సర్వం సిద్ధం చేశారు. పరీక్షా కేంద్రాల్లో బల్లలు, విద్యుత సరఫరా, ఫ్యానలు, బల్బులు, నీటి క్యాన్లు, ప్రథమ చికిత్స శిబిరం తదితర మౌళిక సదుపాయాలను కల్పించారు. పరీక్ష నిర్వహణ అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులకు పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన, కాలుక్యులేటర్‌, స్మార్ట్‌ వాచ, ఇతర ఎలక్రానిక్‌ వస్తువులను అనుమతించడం లేదు. ఉదయం 9.30 గంటలకు పరీక్షలు ప్రారంభం కానుండగా, ఆ సమయానికే లోపే విద్యార్థులు కేంద్రాల్లోకి చేరుకోవాల్సి ఉంటుంది. అటు తర్వాత వచ్చేవారిని అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. పరీక్ష ముగిసే మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యార్థులను బయటికి అనుమతించరు. హిందూపురం పరిధిలో 13 పరీక్షా కేంద్రాలు సిద్ధం చేశారు. 3380 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు అధికారులు తెలిపారు.

పెనుకొండ: పట్టణంలో మూడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్ర భుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 230 మంది విద్యార్థులు పరీక్షలు రాయ నున్నారు. వీరికోసం 9 గదులు ఏర్పాటు చేశారు. బాలికల ఉన్నత పాఠశాల లో 261 మంది విద్యార్థులకు గాను 9 గదులు, ప్రైవేట్‌ పాఠశాలలో 260 మంది పరీక్షలు రాయనుండగా, 12 గదులను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు డీవైఈఓ రంగస్వామి తెలిపారు.

గోరంట్ల: మండలంలోని 9 ఉన్నత పాఠశాలలు, ఖాజాపురం కేజీబీవీ, గి రిజన బాలికల గురుకుల పాఠశాలతో పాటు 8 ప్రైవేట్‌ పాఠశాలలకు చెం దిన మొత్తం 1421 మంది పదో తరగతి పరీక్షలు రాయనున్నట్లు ఎంఈఓ గోపాల్‌నాయక్‌ తెలిపారు. ఇందుకోసం గోరంట్లలోని ఏడు పాఠశాలల్లో 71 మంది ఇన్విజిలేటర్లు, ఏడుగురు డీఓలు, ఏడుగురు సీఎ్‌సఓల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.గోరంట్ల బాలికల ఉన్నత పాఠశాల, ఉదయ్‌కిరణ్‌ స్కూల్‌లో డెస్కులు తక్కువపడటంతో మరోచోటి నుంచి తరలించారు. పాలసముద్రం గ్రేట్‌వే స్కూల్‌ నుంచి 70 డెస్కులు బాలికోన్నత పాఠశాల కు, ఉదయ్‌కిరణ్‌ స్కూల్‌లో గ్రేట్‌వే నుంచి 37 డెస్కులు, ఖాజాపురం కేజీబీవీ నుంచి 63 డెస్కులను ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖాధికారులు తెలిపా రు. కాగా బాలికోన్నత పాఠశాలలో 250 మందికిగాను 12 మంది ఇన్విజిలేటర్లు, బాలుర ఉన్నత పాఠశాలలో 200 మందికి పదిమంది, శ్రీచైతన్య పా ఠశాలలో 249 మందికి 12మంది, న్యూమాంటిస్సొరి 222కు 11 మంది, ఉదయ్‌కిరణ్‌ స్కూల్‌లో 170 మందికి పది మంది, ఉర్దూ ఉన్నత పాఠశాలలో వంద మందికి ఆరుగురు, శ్రీవివేకానంద పాఠశాలలో 180మంది విద్యార్థులకు 10 మంది ఇన్విజిలేటర్లను నియమించారు.

రొద్దం: మండలకేంద్రంలోని జిల్లాపరిషత ఉన్నత పాఠశాలలో ఏ, బీ సెంటర్లలో 289 విద్యార్థులు, కస్తూర్బా పాఠశాలలో బీ సెంటర్‌లో 180 మం ది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు ప్రధానోపాధ్యాయులు పద్మజ, నాగరత్నమ్మ తెలిపారు. విద్యార్థులు అరగంట ముందే పాఠశాలకు చేరుకోవాలన్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షలకు అనుమతించమన్నారు.

లేపాక్షి: మండలవ్యాప్తంగా 829 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నట్లు ఎంఈఓ నాగరాజునాయక్‌ తెలిపారు. వీజెడ్పీ హైస్కూల్‌లో 275 మంది, మహాత్మా జ్యోతిబాఫూలే పాఠశాలలో 286 మంది, ఓరియంటల్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 268 మంది పరీక్ష రాయనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు పూర్తీచేసినట్లు తెలిపారు.

సోమందేపల్లి: మండలవ్యాప్తంగా 580 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నట్లు ఎంఈఓ ఆంజనేయులునాయక్‌ తెలిపారు. సోమందేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, క్రీస్తుజ్యోతి, విజ్ఞాన పాఠశాలల్లో ్లసెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాలవద్ద 30యాక్ట్‌ అమలులో ఉంటుందని తెలిపారు.

మడకశిరటౌన:మడకశిర మండలంలో 17 ఉన్నత పాఠశాలలకు గాను 1106 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు ఎంఈఓ భా స్కర్‌ తెలిపారు. మడకశిరలో ఏడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రొళ్ల మండలంలో 12 ఉన్నత పాఠశాలల్లోని 447 మంది విద్యార్థులకు రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. గుడిబండలో 11 ఉన్నత పాఠశాలల్లో ని 540 మంది విద్యార్థులకు మూడు పరీక్షా కేంద్రాలు, అమరాపురం మం డలంలో 11 పాఠశాలల్లోని 683 మంది విద్యార్థులకు గాను మూడు పరీక్షా కేంద్రాలు, అగళి మండలంలో 8 పాఠశాలల్లోని 337 మంది విద్యార్థులకుగాను రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

అగళి: మండలకేంద్రంలోని కస్తూరీబా పాఠశాలలో 176 మంది, జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో 199 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష లు రాయనున్నట్లు ఎంఈఓ గోపాల్‌ తెలిపారు. తెలిపారు.

అట్టల పంపిణీ

పరిగి: మండలంలోని కొడిగెనహళ్లి గురుకుల ప్రతిభా పాఠశాల విద్యా ర్థులు 520 మందికి ఆదివారం 1977 బ్యాచ పూర్వ విద్యార్థి, రిటైర్డ్‌ సైంటిస్ట్‌ శ్రీలక్ష్మీకాంతం, కియ పరిశ్రమ కాంట్రాక్టర్‌ సురే్‌ష రైటింగ్‌ ప్యాడ్స్‌ అందజేశారు. దాతలను ప్రిన్సిపాల్‌ మురళిధర్‌బాబు అభినందించారు. కార్యక్రమం లో ఫిజికల్‌ సైన్స ఉపాధ్యాయుడు నాగమోహన, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T00:08:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising