పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ABN, First Publish Date - 2023-05-28T23:40:53+05:30
గోరంట్ల, హిందూపురంలో ఆది వారం పూర్వ విద్యార్థులు సందడి చేశారు. గోరంట్ల బాలికోన్నత పాఠశాలలో 1976-77 బ్యాచలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల స మ్మేళనం ఘనంగా జరిగింది.
గోరంట్ల/హిందూపురం మే 28: గోరంట్ల, హిందూపురంలో ఆది వారం పూర్వ విద్యార్థులు సందడి చేశారు. గోరంట్ల బాలికోన్నత పాఠశాలలో 1976-77 బ్యాచలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల స మ్మేళనం ఘనంగా జరిగింది. 46 సంవత్సరాల తర్వాత 63ఏళ్ల వయసులో బాల్య మిత్రులు ఒక్కచోట చేరారు. ప్రధానోపాధ్యాయులు శోభ అధ్యక్షత వహించారు. గురువులు రఘురాంరెడ్డి, హనుమంతరెడ్డి, శం కర్‌నారాయణ, వెంకటరెడ్డి, వెంకటరమణలను శాలువా, పూలమాలల తో సన్మానించారు. పూర్వ విద్యార్థులు తీపి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. ఒకరినొకరు యోగ క్షేమాలు తెలుసుకుంటూ మధురానుభూతి పొందారు. సమావేశానికి 40మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు.
హిందూపురం ఎస్‌డీజీఎస్ కళాశాలలో 2006-2009 బ్యాచలో ఓపెన డిగ్రీ చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం కళాశాలలో జరిగింది. కళాశాలలో స్నేహితులతో కలిసి కలియ తిరిగారు. అప్పటి జ్ఞాపకాలు నెమరేసుకున్నారు. గురువులను సత్కరించారు. కార్యక్రమంలో కళాశా ల కమిటీ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - 2023-05-28T23:40:53+05:30 IST