ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అందని పశుబీమా

ABN, First Publish Date - 2023-11-29T00:12:19+05:30

మండలంలోని రైతులు వ్యవసాయానికి ప్రతామ్నాయంగా పాడి పాడి పరిశ్రమపైనే ఆధార పడి జీవిస్తున్నారు.

పాడి ఆవు కళేబరం వద్ద రైతు ఈరప్ప,

మృత్యువాత పడుతున్న పాడి పశువులు

పట్టించుకోని అధికారులు.. నష్టపోతున్న పాడిరైతులు

మడకశిర రూరల్‌, నవంబరు 28: మండలంలోని రైతులు వ్యవసాయానికి ప్రతామ్నాయంగా పాడి పాడి పరిశ్రమపైనే ఆధార పడి జీవిస్తున్నారు. అయితే వాటిలోనూ నష్టాలు వస్తుండడంతో ఆర్థికంగా ఇబ్బందుల పాలు అవుతున్నారు. రెండేళ్లలో మడకశిర సెక్టార్‌ పరిధిలో దాదాపు 150కి పైగా పాడి ఆవులు మృత్యువాతన పడ్డాయి. అయినా సంబంధిత శాఖ అధికారులెవరూ పట్టించుకోవడం లేదని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని తూరుకువాండ్ల పల్లికి చెందిన ఈరప్ప అనే రైతు రూ.65 వేలు పెట్టి పాడి ఆవును తెచ్చుకున్నాడు. అది మంగళవారం ఉదయం పెయ్య దూడకు జన్మనిచ్చింది. అయితే కొన్ని గంటలకే మధ్యాహ్నానికి ఆవు మృతిచెందింది. ఈనేందుకు ఆవు ఎంతో బాధపడిందని, ఆ సమయంలో దానిని పశువైదశాలకు తీసుకెళదామంటే అక్కడ డాక్టర్లు ఎవ్వరూలేరని రైతు తెలిపాడు. దూడను ఈనిన తరువాత కొన్ని గంటలకే మృతిచెందగా గ్రామ సమీపంలో పూడ్చివేసినట్లు తెలిపారు. దానికి బీమా కూడా చేయించానని, అయితే ఇప్పుడు బీమా అందదని అధికారులు తెలుపుతున్నారని వాపోయాడు. ఆర్థికంగా నష్టపోయిన తనను ప్రభుత్వమే ఆదుకోవాలిని కోరాడు.

పశువుల బీమాను యఽథావిధిగా కొనసాగించాలి : మురళీబాబు, టీఎనఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు

మృతి చెందిన పాడి ఆవులకు ఇచ్చే బీమాను ప్రభుత్వం యథావిధిగా కొనసాగించాలి. పాడి ఆవులకు ఇచ్చే బీమాను రద్దుచేయాడం చాల దారుణం అన్నారు. పాడి ఆవులు మృతి చెందితే సంబంధిత బీమాను వెంటనే చెల్లించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి.

ప్రభుత్వం బీమాను రద్దుచేసింది - డాక్టర్‌ అమర్‌, ఏడీ, పశువైద్యశాల, మడకశిర

మృతి చెందిన పాడి పశువులకు ఇచ్చే బీమాను 2023, జనవరి 1 నుంచి ప్రభుత్వం రద్దుచేశారు. ఆ తరువాత బీమా కోసం చేసుకున్న దరఖాస్తులు అప్‌లోడ్‌ కాలేదు. దీంతో జనవరి1 తరువాత మృతిచెందిన పాడి పశువులకు బీమా సొమ్ము రాదు. రైతులు పాడి పశువులపై బ్యాంక్‌లో రుణాలు తీసుకోనే సమయంలో బీమా చేయించి ఉంటే అది వరిస్తుంది. రైతులు బ్యాంక్‌ అధికారులను సంప్రదించాలి. ప్రస్తుతం ప్రభుత్వం ఇవ్వడం లేదు.

Updated Date - 2023-11-29T00:12:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising