50 రోజులు పూర్తిచేసుకున్న అన్న క్యాంటీన
ABN, First Publish Date - 2023-04-10T23:20:17+05:30
పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీ డీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత ఆధ్వర్యంలో నిర్వహిస్తు న్న ఎన్టీఆర్ అన్న క్యాంటీన సోమవారం నాటికి 50వ రోజు పూర్తిచేసుకుంది.
పెనుకొండ, ఏప్రిల్ 10: పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీ డీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత ఆధ్వర్యంలో నిర్వహిస్తు న్న ఎన్టీఆర్ అన్న క్యాంటీన సోమవారం నాటికి 50వ రోజు పూర్తిచేసుకుంది. టీడీపీ నాయకులు త్రివేంద్రనాయుడు, గుట్టూరు సూర్యనారాయణ, వాసుదేవరెడ్డి, బాబుల్‌రెడ్డి, ఈశ్వర్‌ప్రసాద్, కార్యకర్తల ఆధ్వర్యంలో చిన్నారులచేత కేక్ కట్ చేయించారు. అనంతరం నా యకులు మాట్లాడుతూ పేదలకు రూ.5కే కడుపునిండా అన్నం పె ట్టాలనే ఉద్దేశంతో ప్రారంభించిన అన్న క్యాంటీన 50 రోజులు పూర్తిచేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రతిరోజూ వందలాది మం ది ఆకలి తీర్చుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.
Updated Date - 2023-04-10T23:20:17+05:30 IST