Anantapuram Dist.: 15 ఏళ్ళ బాలికకు తాళి కట్టిన యువకుడు
ABN, First Publish Date - 2023-01-20T13:03:13+05:30
అనంతపురం జిల్లా: ఉరవకొండ మండలంలో దారుణం జరిగింది. మైనారిటీ తీరని ఓ బాలికకు మాయచేసి శ్రీకాంత్ అనే యువకుడు తాళి కట్టాడు.
అనంతపురం జిల్లా: ఉరవకొండ మండలంలో దారుణం జరిగింది. మైనారిటీ తీరని ఓ బాలికకు మాయచేసి శ్రీకాంత్ అనే యువకుడు తాళి కట్టాడు. అమిత్యాలలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. గ్రామానికి చెందిన హేమలత అనంతపురం జిల్లా ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన 23 ఏళ్ల శ్రీకాంత్.. ఆమెను ప్రేమ పేరుతో నమ్మించాడు. పెళ్లి చేసుకుందామంటూ మెడలో పసుపు కొమ్ము కట్టేశాడు. రామప్ప, ఆదిలక్ష్మి దంపతుల నాల్గవ కుమార్తె హేమలత. ఇటీవల ఆమె తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. తల్లి వ్యవసాయ కూలి, మరోవైపు శ్రీకాంత్ తండ్రి కూడా చనిపోయాడు. యువకుడి తల్లి ఉమాదేవి వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. పూర్తి సమాచారం అందవలసి ఉంది.
Updated Date - 2023-01-20T13:04:15+05:30 IST