కొండపి ఎమ్మెల్యేపై దాడిహేయం
ABN, First Publish Date - 2023-06-07T00:12:33+05:30
శాసనసభలో తెలుగుదేశం పార్టీ విప్, కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామిపై వైసీపీ నాయకుల దాడి హేయమైన చర్య అని టీడీపీ ఎస్సీసెల్ జిల్లా ఉపాధ్యక్షుడు కేశగాళ్ల శ్రీనివాసులు ఖండించారు.
ధర్మవరం, జూన 6: శాసనసభలో తెలుగుదేశం పార్టీ విప్, కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామిపై వైసీపీ నాయకుల దాడి హేయమైన చర్య అని టీడీపీ ఎస్సీసెల్ జిల్లా ఉపాధ్యక్షుడు కేశగాళ్ల శ్రీనివాసులు ఖండించారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దళిత ఎమ్మెల్యేపై దాడి చేసి, ఆయనపైనే కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. సీఎం జగన దళితులపై దాడులు చేయించడం దారుణమన్నారు. వచ్చే ఎన్నికల్లో దళితులు వైసీపీకి ఓటు ద్వారా బుద్ధి చెబుతారన్నారు. సమావేశంలో ఎస్సీసెల్ నాయకులు బుక్కపట్నం శ్రీనివాసులు, గజ్జల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
Updated Date - 2023-06-07T00:12:33+05:30 IST