ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఓటమి భయంతోనే దాడులు

ABN, First Publish Date - 2023-08-06T00:28:09+05:30

బత్తలపల్లి, ఆగస్టు 5: ప్రజల్లో టీడీపీకి వస్తున్న ఆదరణను చూసి.. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయం వైసీపీ వారికి పట్టుకుందని, అందువల్లే దాడులకు పాల్పడుతున్నారని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి పరిటాల శ్రీరామ్‌ విమర్శించారు. పుంగనురులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడి కాన్వాయ్‌పైనా, టీడీపీ కార్యకర్తలపైన వైసీపీ అల్లరి మూకలు రాళ్ల దాడి చేయడా న్ని ఖండిస్తూ.. మండలకేంద్రంలో శనివారం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆందోళన చేశారు.

వైసీపీపై విమర్శలు చేసిన టీడీపీ ధర్మవరం నియోజకవర్గ

ఇనచార్జి పరిటాల శ్రీరాం

బత్తలపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి దిష్టిబొమ్మ దహనం

బత్తలపల్లి, ఆగస్టు 5: ప్రజల్లో టీడీపీకి వస్తున్న ఆదరణను చూసి.. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయం వైసీపీ వారికి పట్టుకుందని, అందువల్లే దాడులకు పాల్పడుతున్నారని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి పరిటాల శ్రీరామ్‌ విమర్శించారు. పుంగనురులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడి కాన్వాయ్‌పైనా, టీడీపీ కార్యకర్తలపైన వైసీపీ అల్లరి మూకలు రాళ్ల దాడి చేయడా న్ని ఖండిస్తూ.. మండలకేంద్రంలో శనివారం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆందోళన చేశారు. స్థానిక పార్టీ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం శ్రీరామ్‌ మాట్లాడుతూ చంద్రబాబు నీటి ప్రాజెక్టులను సందర్శించి ప్రభుత్వ వెఫల్యాలను ఎండగడుతున్నారని, ఆయన పర్యటనకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని, దీన్ని జీర్ణించుకోలేని వైసీసీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇది నీతిమాలిన చర్యగా అభివర్ణించారు. జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న చంద్రబాబు పైనే రాళ్లు రువ్వారంటే.. సామాన్య ప్రజల పరిస్థితి ఏంటో అర్థమవుతోందన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గోనుగుంట్ల విజయకుమార్‌, నాయకులు చింతలపల్లి మహేష్‌., చల్లా శ్రీనివాసులు, నారాయణరెడ్డి, జక్కపూటి నాగభూషణం, లక్ష్మినారాయణ, నెట్టెం రమణ, సురేంద్ర, రవి తదితరులు పాల్గొన్నారు,

Updated Date - 2023-08-06T00:28:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising