ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవకతవకలు నిగ్గు తేలేనా?

ABN, First Publish Date - 2023-04-01T00:36:29+05:30

వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమాలో అవకతవకలు నిగ్గుతేలేనా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమార్కుల్లో ఎక్కువ శాతం అధికార పార్టీకి చెందిన వారు ఉండటంతో వాస్తవాలు కప్పిపుచ్చేందుకు కొందరు వైసీపీ ముఖ్య నాయకులు ప్రయత్నించినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో విచారణకు వెళ్లిన కొందరు అధికారులపై చూసీచూడనట్లు వెళ్లాలంటూ ఎమ్మెల్యేలు, మరికొన్ని ప్రాంతాల్లో వైసీపీ ముఖ్యనాయకులు ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం

ఎలాంటి పంటలు సాగు చేయకపోయినా ఉచిత పంటల బీమా వర్తింపజేసిన భూములు ఇవే..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఉచిత పంటల బీమాలో అక్రమాలపై విచారణ

ఐదు రోజులుగా క్షేత్ర స్థాయిలో అధికారుల పర్యటన

ఇప్పటికే విచారణ పూర్తి చేసిన కొందరు ఏడీఏలు

మరికొంత మంది రెండు రోజుల్లో పూర్తి చేసే అవకాశం

అక్రమాలను నిర్ధారించిన అధికారులు

ఎమ్మెల్యేలు, వైసీపీ ముఖ్యనేతల నుంచి ఒత్తిడి

తర్జనభర్జనలో విచారణ అధికారులు

వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమాలో అవకతవకలు నిగ్గుతేలేనా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమార్కుల్లో ఎక్కువ శాతం అధికార పార్టీకి చెందిన వారు ఉండటంతో వాస్తవాలు కప్పిపుచ్చేందుకు కొందరు వైసీపీ ముఖ్య నాయకులు ప్రయత్నించినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో విచారణకు వెళ్లిన కొందరు అధికారులపై చూసీచూడనట్లు వెళ్లాలంటూ ఎమ్మెల్యేలు, మరికొన్ని ప్రాంతాల్లో వైసీపీ ముఖ్యనాయకులు ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. క్షేత్ర స్థాయిలో ఈ క్రాపింగ్‌లో అక్రమాలతో ఉచిత పంటల బీమా అనర్హులకు మంజూరైన విషయాలు తేలినా అధికార పార్టీ నేతల ఒత్తిడి నేపథ్యంలో వాస్తవాలు పంపితే స్థానిక నేతల నుంచి ఇబ్బందులు తప్పవని, తప్పిదాలు కప్పిపుచ్చేందుకు కొందరు సిద్ధమైనట్లు సమాచారం. నేరుగా వ్యవసాయ శాఖ కమిషన రేట్‌ నుంచి జాబితా పంపించి, విచారించాలని ఆదేశించడంతో మరికొందరు అధికారులు వైసీపీ నేతల నుంచి ఒత్తిడి వచ్చినా తమ పని తాము చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

అనంతపురం అర్బన

ఐదు రోజులుగా క్షేత్ర స్థాయిలో విచారణ

2021-22 సంవత్సరం ఖరీ్‌ఫకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో 4 లక్షల మంది రైతులకు రూ.855.55 కోట్ల వైఎ్‌సఆర్‌ ఉచిత పంటల బీమాను మంజూరు చేశారు. ఈ క్రాపింగ్‌ ఆధారంగా ఉచిత పంటల బీమా వర్తింపజేశారు. ఎనిమిది నియోజక వర్గాల్లో 70 మంది రైతులకు సంబంధించి చీనీ, వేరుశనగ, మిరప, పొద్దుతిరుగుడు, వరి, కంది, స్వీట్‌ కార్న్‌, రాగి పంటలు సాగు చేయకపోయినా, పంట వేసినట్లు క్రాపింగ్‌ చేయించి, ఉచిత పంటల బీమా పొందినట్లు ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. అలాగే 13 మంది రైతులకు సంబంధించి పత్తి, మిరప, వరి, స్వీట్‌ కార్న్‌, నారింజ పంట సాగు చేసిన విస్తీర్ణం కంటే ఎక్కువ విస్తీర్ణాన్ని ఈక్రాపింగ్‌ చేసినట్లు చూపారు. ఈ నేపథ్యంలో పలువురు ఏడీఏలకు విచారణ బాధ్యతలు అప్పగించారు. గత ఐదు రోజులుగా క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టారు. కొందరు ఏడీఏలు ఇప్పటికే విచారణ పూర్తి చేయగా, మరో రెండు రోజుల్లో కొందరు ఏడీఏల విచారణ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

బీడు భూములకు పంటల బీమా మంజూరు చేసినట్లు నిర్ధారణ

ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో బీడు భూములకు ఉచిత పంటల బీమా వర్తింపజేసినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో బీడు భూముల యజమానులనుంచి డబ్బులు వసూలు చేసి ఈ క్రాపింగ్‌లో పంట వేసినట్లు నమోదు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో సాగు భూముల్లో పంట సాగు చేయకపోయినా చేసినట్లు చూపించి ఉచిత పంటల బీమా పొందినట్లు సమాచారం. రెండేళ్ల క్రితం పంట సాగు చేశారా..? లేదా అన్న విషయాన్ని నిర్ధారించుకోవడంలో విచారణ అధికారులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. విచారణ అధికారులకు నిజాలు చెబితే గొడవలు అవుతాయన్న కారణంతో స్థానిక ప్రజలెవరూ ముందుకురానట్లు తెలిసింది. కొందరు ఆర్బీకే సిబ్బంది, వీఆర్వోల కాసుల కక్కుర్తి, తప్పిదాలతోనే ఈ క్రాపింగ్‌లో అక్రమాలు జరిగినట్లు సమాచారం.

తర్జనభర్జనలో అధికారులు

అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిడుల నేపథ్యంలో నివేదికలు సమర్పించడంలో కొందరు అధికారులు తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. విచారణకు వెళ్లిన సమయంలో జాబితాలోని వారితోపాటు ఇతరులకు సంబంధించిన అక్రమాలు తమ దృష్టికి వచ్చినా చేసేదేమిలేక మిన్నకుండిపోతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనే విచారణ పూర్తయినా నివేదికలు సమర్పించడంలో జాప్యం చేస్తున్నట్లు తెలిసింది. వ్యవ సాయ శాఖ కమిషనరేట్‌ నుంచి నేరుగా జాబితాను పంపి, విచారణ చేయించడంతో తాము నిర్ధారించిన విషయాలనే నివేదికల్లో పొందుపర్చేందుకుకొందరు సిద్ధమైనట్లు తెలిసింది. ఎవరేం నివేదికలు ఇస్తున్నారోనని ఒకరికొకరు వ్యక్తిగతంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ఉన్నతాధికారుల వద్ద సమగ్ర సమాచారం ఉన్నందున నివేదికల్లో తేడా వస్తే నేరుగా రాష్ట్ర స్థాయి నుంచి మరో మారు విచారణ బృందాన్ని పంపే అవకాశాలు ఉండటంతో ఏం చేయాలో తోచని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో ఏ మేరకు విచారణ నివేదికలు సమర్పిస్తారన్న అంశంపై వ్యవసాయ శాఖలో చర్చ సాగుతోంది.

Updated Date - 2023-04-01T00:36:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising