ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.75 కోట్ల బీటీ రోడ్ల పనులు రద్దు

ABN, First Publish Date - 2023-04-25T00:03:13+05:30

నియోజకవర్గంలో బీటీ రోడ్ల నిర్మాణానికి గ్రహణం పట్టింది. వైసీపీ ప్రభుత్వం శీతకన్ను వేసింది. అధికారం చేప ట్టినప్పటి నుంచి రూ.75 కోట్ల విలువైన రోడ్ల నిర్మాణానికి బ్రేక్‌ వేసిం ది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెండర్‌ అగ్రిమెంట్లకు మూడేళ్లు

పీఆర్‌ నుంచి ఆర్‌అండ్‌బీకి

బదలాయించినా మారని రూపురేఖలు

258 కిలోమీటర్ల పనులకు గ్రహణం

మడకశిర, ఏప్రిల్‌ 24: నియోజకవర్గంలో బీటీ రోడ్ల నిర్మాణానికి గ్రహణం పట్టింది. వైసీపీ ప్రభుత్వం శీతకన్ను వేసింది. అధికారం చేప ట్టినప్పటి నుంచి రూ.75 కోట్ల విలువైన రోడ్ల నిర్మాణానికి బ్రేక్‌ వేసిం ది. పంచాయతీ రాజ్‌ శాఖ నుంచి ఆర్‌అండ్‌బీ పరిధిలోకి రహదారుల ను బదలాయించి మూడేళ్లయ్యింది. నేటికీ వాటి రూపురేఖలు మారలే దు. 258 కిలోమీటర్ల మేర చేపట్టాల్సిన పనులు టెండర్‌ అగ్రిమెంట్ల ద శలోనే పడకేశాయి. ఫలితంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల రో డ్లకు మోక్షం లేకుండాపోయింది. కంకరతేలి, గతుకులమయమైన రోడ్ల లో పల్లె జనం నకరప్రయాణం సాగిస్తున్నారు.

టీడీపీ హయాంలో నిధుల మంజూరు

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలోని గ్రామీణ రో డ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రోడ్ల అభివృద్ధికి కోట్లాది రూపాయ ల నిధులు మంజూరు చేసింది. సంబంధిత పనులకు అప్పట్లోనే టెండ ర్లు పిలిచి అగ్రిమెంట్‌లు చేశారు. పలుచోట్ల కొంతమేర పనులు కూడా జరిగాయి. ఈక్రమంలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టింది. గ్రామీ ణ రోడ్ల అభివృద్ధిపై కక్ష కట్టింది. 25 శాతంలోపు జరిగిన పనులు రద్దు చేసింది. ఆపైబడి జరిగిన పనులు కొనసాగించే విధంగా నిర్ణ యం తీసుకుంది. దాదాపు రూ.140 కోట్లకు సంబంధించిన పనులు ర ద్దయి మూడేళ్లు దాటింది. నేటికీ రోడ్ల అభివృద్ధికి నిధుల ఊసే లేకుం డా పోయింది. గతుకుల రోడ్లలో ప్రయాణం నరకంగా మారిందని స్థా నికులు వాపోతున్నారు.

ముందుకు సాగని పనులు

మూడేళ్ల క్రితం మడకశిర నియోజకవర్గంలో ఆర్‌అండ్‌బీ పరిధిలో ని రోడ్ల అభివృద్ధికి దాదాపు రూ.140 కోట్లు గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఔటర్‌రింగ్‌ రోడ్డుకు రూ.60 కోట్లు మంజూరైంది. ఇందులో భూసేకరణకు రూ.10 కోట్లు, ఔటర్‌రింగ్‌ రోడ్డుకు రూ.50 కో ట్లు, నియోజకవర్గ పరిధిలోని ఆరు రోడ్లకు రూ.50 కోట్లు, కిరికెర, మో ర్‌బాగల్‌ వయా హేమావతి రోడ్డుకు రూ.20 కోట్లు కేటాయించారు. టెండర్లు చేపట్టి పనులు కూడా ప్రారంభించారు. ప్రభుత్వం మారడంతో 25 శాతంలోపు పనులు జరిగాయి. మరో రూ.75 కోట్ల వి లువైన పనులు రద్దు చేశారు. మూడేళ్లు పైబడుతున్నా ఇప్పటివరకు ఆరోడ్లకు నిధులు మంజూరు కాలేదు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు పూర్తి అయ్యి ఉంటే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉండేదని ఈ ప్రాంత ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పంచాయితీ రాజ్‌ శాఖ నుంచి ఆర్‌అండ్‌బీ పరిధిలోకి పలు రోడ్లను బదలాయించినా ప్ర యోజనం లేకుండా పోయింది.

అప్పటికే దెబ్బతిన్న రోడ్లు మరింత దుస్థితికి చేరుకున్నాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పీఆర్‌ నుంచి ఆర్‌అండ్‌బీ పరిధిలోకి 258 కిలోమీటర్ల మేర రోడ్లను బదలాయించారు. అందులో మడకశిర మండలంలో 70 కిలోమీటర్లు, అగళిలో 60 కిలోమీటర్లు, రొళ్లలో 50 కిలోమీటర్లు, గుడిబండలో 40 కిలోమీటర్లు, అమరాపురంలో 38 కిలోమీటర్లను చేర్చారు. పంచాయతీ రాజ్‌ శాఖ పరిధిలో ఉన్నప్పడు మెటల్‌ వేసి మట్టిని వేశారు. దీంతో ఆరోడ్లను అభివృద్ధి చేసేందుకు ఆర్‌అండ్‌బీ పరిధిలోకి తీసుకున్నారు. అయితే నేటికీ ఆరోడ్లు అభివృద్ధికి నోచుకోలేదు. ప్రభుత్వం స్పందించి రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.

నిధులు మంజూరైన వెంటనే పనులు చేపడతాం

లక్ష్మీనారాయణ, ఆర్‌అండ్‌బీ ఏఈ

మూడేళ్ల క్రితం ఆర్‌అండ్‌బీ పరిధిలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి, ఆరు రోడ్ల మెటల్‌ రోడ్లను బీటీ రోడ్లుగా మార్చడానికి నిధులు మంజూరయ్యాయి. ప్రభుత్వం మారడంతో 25 శాతంలోపు పనులు జరిగిన వాటిని రద్దు చేశారు. 25 శాతం పైబడి జరిగిన పనులను కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో నిబంధనలకు లోబడి లేని పనులు రద్దయ్యాయి. వాటికి నిధులు మంజూరైన వెంటనే పనులు చేపట్టి, మెటల్‌ రోడ్లను బీటీ రోడ్లుగా మారుస్తాం.

Updated Date - 2023-04-25T00:03:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising