షార్ట్‌సర్క్యూట్‌తో కారు దగ్ధం
ABN, First Publish Date - 2023-04-20T23:21:50+05:30
స్థానిక నంది విగ్రహం వెనుక గురువారం షార్ట్‌సర్క్యూట్‌తో కారు దగ్ధమైంది. చింతతోపు వద్ద ఆపిఉన్న ఓకారులో మంటలు చెలరేగడాన్ని గుర్తిం చారు.
లేపాక్షి, ఏప్రిల్ 20: స్థానిక నంది విగ్రహం వెనుక గురువారం షార్ట్‌సర్క్యూట్‌తో కారు దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాలివి. చింతతోపు వద్ద ఆపిఉన్న ఓకారులో మంటలు చెలరేగడాన్ని గుర్తిం చారు. కారు షార్ట్‌సర్క్యూట్‌తో దగ్ధమైనట్లు కంచిసముద్రం గ్రామానికి చెందిన సోమశేఖర్ తెలిపారు. కారు తనదేనని, పనినిమిత్తం లేపాక్షికి రాగా చెట్టుకింద నీడలో ఆపానన్నారు. ఇంతలోనే ఇంజన నుండి మంటలు చెలరేగాయని బాధితుడు వాపోయాడు. ఘటనపై పోలీసులను వివరణ కోరగా, తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు.
Updated Date - 2023-04-20T23:21:50+05:30 IST